Home జాతీయ వార్తలు దేశవ్యాప్తంగా 36 వేల మోడల్ గిరిజన గ్రామాల అభివృద్ధి

దేశవ్యాప్తంగా 36 వేల మోడల్ గిరిజన గ్రామాల అభివృద్ధి

36000 tribal model villages to be developed in india

 

గౌహతి: గ్రామీణాభివృద్ధి, అటవీ సంరక్షణ హక్కులు, స్వదేశీ తెగల ఆచారవ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ దేశవ్యాప్తంగా 36000 కుగ్రామాలను ‘నమూనా గిరిజన గ్రామాలుగా’ అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా సోమవారం తెలిపారు. వీటిలో 1700 గ్రామాలు అస్సాంకు చెందినవై ఉంటాయని కూడా ఆయన విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసుకున్న గ్రామాల్లో కనీస వసతులను మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. మంత్రి అర్జున్ ముండా  రెండు రోజుల పర్యటనపై అస్సాం వెళ్లారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతో చర్చించానని, 50శాతం కంటే ఎక్కువ గిరిజనులు నివసించే గ్రామాలకు ఈ కార్యక్రమం కింద ప్రాధాన్యతనివ్వనున్నామని కూడా ఆయన తెలిపారు. మంత్రి తన పర్యటనలో చిరు అటవీ ఉత్పత్తులు, వన్ ధన్ స్వయం సహాయక గ్రూపులు సహా గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ‘తనకు గిరిజన లబ్ధిదారులు 25కుపైగా ఉత్పత్తులను చూయించారని, అది ఎంతో ప్రోత్సహకరంగా ఉంది’ అన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా గవర్నర్ జగదీశ్ ముఖి, ముఖ్యమంత్రి తదితరులతో సమావేశాలు నిర్వహించారు.

36000 tribal model villages to be developed in india