Tuesday, April 23, 2024

యాదాద్రి లక్ష్మి నృసింహునికి 37 తులాల బంగారం….

- Advertisement -
- Advertisement -

మంత్రి హరీష్ రావు పిలుపుతో స్వచ్ఛంధంగ యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సిలర్స్, కార్యకర్తలు ఐదుగురి సభ్యులతో యదాద్రికి బంగారం సేకరణ….
సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మికత సేవా భావానికి మారుపేరు మన సిద్దిపేట….

370 grams gold for Lakshmi Narasimha

సిద్దిపేట: సిఎం కెసిఆర్ ఇటీవల యదాద్రి పర్యటన లో భాగంగా ఆలయం గోపురాన్ని బంగారు తాపడంతో నిర్మిస్తున్నట్లు అందుకు విరాళాలు సేకరణ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పక్షాన హరీష్ రావు కిలో బంగారం ప్రకటించారు. సిద్దిపేట అన్నింటిలో ఆదర్శంగా ఉందని, తెలంగాణ సాధించిన గడ్డగా పేరుందని, అంత గొప్ప క్షేత్రం చరిత్రలో నిలిచే ఆలయంలో సిద్దిపేట పేరు ఉండాలన్నారు. సిద్దిపేట సామాజిక , ఆధ్యాత్మిక , ధార్మిక సేవా భావం కలిగిఉన్న ప్రాంతం మన సిద్దిపేట అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి సిద్దిపేట నుండి బంగారం సేకరణ కు ఐదుగురితో ఒక ప్రత్యేక కమిటీ వేయాలని చెప్పారు.. ఇందులో ఆధ్యాత్మిక వైపు ఉన్న వారిని భాగస్వామ్యం చేసి కిలో బంగారం సేకరణ చేసి అందరం కల్సి యాదాద్రి కి వెళ్లి ఆ స్వామి వారికి సమర్పిద్దామని పిలుపునిచ్చారు. అయితే ఈరోజు సిద్దిపేట లో జరిగిన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు ఈ విషయాన్ని ప్రస్తావించాగానే కౌన్సిలర్స్, పార్టీ కార్యకర్తలు ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్ఛందంగా మంత్రి హరిశ్ రావు సమక్షంలో ప్రకటించారు..

ఎవరికి ఎంత తోచితే అంత ఇవ్వండి.. తర్వాత ఎంత అవసరం పడ్డ నేను ఇస్తా అని మంత్రి చెప్పారు.. ఇది దైవ సేవ..గొప్ప పుణ్యక్షేత్రం కు మనం అందించే ఉడుత భక్తి అని చెప్పారు..

కడవేర్గు రాజనర్సు – నర్సింలు 5 తులాలు, రంగదాంపల్లి 3వ వార్డు ప్రజల పక్షాన కౌన్సిలర్ వంగ తిరుమల్ రెడ్డి , వంగా నాగిరెడ్డి 3 తులాలు, మచ్చ వేణు గోపాల్ రెడ్డి 2 తులాలు, మేర సత్తన్న 2 తులాలు, రెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 తులాలు, దీప్తి నాగరాజు 39 వార్డు ప్రజలు కల్సి 1-1/2 తులాలు ఇస్తామని తెలియజేశారు.

1 తులం చొప్పున ప్రకటించిన వారు..

బర్ల మల్లి ఖార్జున్, గణేష్ నగర్ యూత్, వినోద్ 5వ వార్డు ఎల్లమ్మ గుడి, తీపి రెడ్డి మహేష్ రెడ్డి, ఈర్షద్ హుస్సేన్, 15 వార్డు ఇమాంబాద్ ప్రజలు శ్రీనివాస్ రెడ్డి, రాజయ్య దామోదర్, 2 వ వార్డు ప్రజలు పక్షాన చంద్రం, సిద్దిపేట పట్టణ మహిళలు, నర్రా రవి, నాయకం లక్ష్మణ్, రమేష్ నర్సాపూర్, ఎల్లం యాదవ్ 43 వ వార్డు, కూర బాల్ రెడ్డి, తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ కళ్ళకుంట కాలనీ, 26 వార్డు హయత్ బాబా, డాక్టర్ విఠోభ, కటాం రఘు, మనీదీప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఆర్య వైశ్య మహిళ సంఘం నాగరాణిలు తులం చొప్పున ప్రకటించారు.  మహిపాల్ బండల మల్లేశం, బూర మల్లేశం, బోయే రాములు అర్థ తులం చొప్పున ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News