Home జాతీయ వార్తలు భారత్ లో కొత్తగా 39,097 వేల కరోనా కేసులు నమోదు

భారత్ లో కొత్తగా 39,097 వేల కరోనా కేసులు నమోదు

39097 Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ: గడిచిన ఒక్కరోజులో భారత్ లో కొత్తగా 39,097 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో  మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరిందని వారు వెల్లడించారు.  ఇందులో 3,05,03,166 మంది కరోనా నుంచి కోలుకున్నారని,  4,20,016 మంది కరోనాతో చనిపోయారని అధికారులు చెప్పారు. మొత్తం కేసుల్లో 4,08,977 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వారు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 35,087 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 546 మంది కరోనాతో చనిపోయారని అధికారులు తెలిపారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు.