Home తాజా వార్తలు గూగుల్ మ్యాప్స్‌లో 3డి గ్లోబ్ మోడ్…

గూగుల్ మ్యాప్స్‌లో 3డి గ్లోబ్ మోడ్…

3D globe mode on google maps

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ వెబ్‌సైట్‌లో 3డి గ్లోబ్ మోడ్ అనే ఫీచర్‌ను సోమవారం ప్రవేశపెట్టింది. దీని ద్వారా గూగుల్ మ్యాప్స్‌లో మ్యాప్‌ను మొత్తం జూమ్ అవుట్ చేస్తే మ్యాప్ సమతలమైన ఉపరితలంతో కాకుండా, 3డి గ్లోబ్ మాదిరిగా కనిపిస్తోంది. ఈ కొత్త ఫీచర్ కేవలం పిసిల్లో వాడే ఇంటర్నెట్ బ్రౌజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకోచ్చింది గూగుల్. క్రోమ్, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలో గూగుల్ మ్యాప్స్ సైట్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ మొబైల్ బ్రౌజర్లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. అతిత్వరలోనే స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఈ ఫీచర్ ను తీసుకోచ్చే అవకాశం ఉందని గూగుల్ పేర్కొంది.