Home ఖమ్మం దేవి నవరాత్రుల నిమజ్జనంలో ఘోర ప్రమాదం..

దేవి నవరాత్రుల నిమజ్జనంలో ఘోర ప్రమాదం..

4 dies after Tractor overturns in Khammam

ఖమ్మం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగొండ మండలంలో దేవి నవరాత్రుల నిమజ్జనంలో ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని బాణాపురం సమీపంలో అయ్యగారిపల్లి ఇసుకల వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దుర్గా దేవి నిమజ్జనానికి వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కమలాపురం గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

4 dies after Tractor overturns in Khammam