Home జాతీయ వార్తలు తమిళనాడులో నలుగురు గ్యాంగ్ స్టర్లు అరెస్టు

తమిళనాడులో నలుగురు గ్యాంగ్ స్టర్లు అరెస్టు

Gangster

 

చెన్నై: తమిళనాడు పోలీసులు నలుగురు గ్యాంగ్ స్టర్లను అరెస్టు చేశారు. ఓ ముఠా గ్యాంగ్ కు చెందిన వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురు గ్యాంగ్ స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజా అనే గ్యాంగ్ స్టర్ తన మోటార్ సైకిళ్ళుపై వెళ్లుతుండగా ఎనిమిది మంది కలిసి రాజాను చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డిన రాజా రక్తస్రావంతో వారి నుండి తప్పించుకోన్ని కొంత దూరం పరుగెత్తి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిసి పుటేజీని పరిశీలించిన పోలీసులు రాజాపై దాడి పాల్పడిన వారు నిజాముద్దీన్, కార్తీక్, థౌబీక్, హరికృష్ణన్ లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

4 Gangsters arrested in Tamil Nadu murder case