Home అంతర్జాతీయ వార్తలు జపాన్ ఓడలో నలుగురు భారతీయులకు కోవిడ్

జపాన్ ఓడలో నలుగురు భారతీయులకు కోవిడ్

Diamond Princes

 

1,770కి చేరిన కోవిడ్ మరణాలు

టోక్యో: జపాన్ సముద్రతీరంలో విడిగా ఉన్న ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలోని నలుగురు భారతీయులకు కోవిడ్ 19 (కరోనా వైరస్) సోకిందని భారత రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. చికిత్సకు వారు స్పందిస్తున్నారు. తాజాగా భారతీయుల్లో నమోదైన రెండు కేసులతో నౌకలో కోవిడ్ సోకిన భారతీయుల సంఖ్య ఐదుకు చేరిందని రాయబార కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. అయితే సోమవారం ఎంబసీ ఆ సంఖ్యను నాలుగు అని సవరించి, తాజా సమాచారం అందించింది. కాగా నౌకలో 99 మందికి కొత్తగా కోవిడ్ 19 సోకడంతో ఓడలో కరోనా రోగుల సంఖ్య 454కు పెరిగింది.

‘డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న భారతీయులతో టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది’ అని తెలిపింది.ఇలా ఉండగా సోమవారంనాడు అమెరికా 340 మంది జాతీయుల్ని ఓడ నుంచి ఖాళీ చేయించింది. వారిలో 14 మందికి వైరస్ సోకిందని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. చైనాలో తాజాగా 105 ఈ వైరస్ వల్ల మరణించడంతో ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 1,770కి పెరిగింది. తాజాగా 100 మంది హెబెయిలో, ముగ్గురు హెనాన్‌లో, ఇద్దరు గుయాంగ్‌డంగ్‌లో చనిపోయారు.

4 Indians Being Treated For COVID-19 in Diamond Princes