Home తాజా వార్తలు పరిశ్రమలో రియాక్టర్ పేలుడు.. తప్పిన ప్రమాదం

పరిశ్రమలో రియాక్టర్ పేలుడు.. తప్పిన ప్రమాదం

4 Injured In Pharma Company Reactor Blast At Balanagar

హైదరాబాద్: మందుల తయారీ పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు కార్మికులు గాయపడిన సంఘటన బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో విరుపక్షా ఫార్మా పరిశ్రమలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. చుట్టూ ఉన్న భవనంతో పాటు సామాగ్రి దెబ్బతింది. ఆసమయంలో పనిచేస్తున్న కార్మికులు దూరంగా ఉండడంతో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు రియాక్టర్ లోకి వెళ్లి వెలుపలికి వచ్చే గాలి ఒత్తిడి పెరగడం కారణంగా భావిస్తున్నారు. పేలుడు సంభంచిన అగ్నిప్రమాదం జరగకపోవడం గమనార్హం. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

4 Injured In Pharma Company Reactor Blast At Balanagar