Home జోగులాంబ గద్వాల్ కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణమ్మ ఉగ్రరూపం

4 lakhs cusecs water flow for krishna river

 

తంగిడి వద్ద నీట మునిగిన దత్త ఆలయం

మన తెలంగాణ/మక్తల్ : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోకి ప్రవహించే తంగిడి సంగమం వద్ద నదీప్రవాహం ఉరకలేస్తోంది. కర్నాటక పైనుంచి ఇటు భీమానది, అటు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతుండటంతో తంగిడి వద్ద దత్తఆలయం నీట మునిగింది. బసవేశ్వరుని విగ్రహంతోపాటు దత్తఆలయ పరిసరాల్లోకి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో నదివైపు ఎవరూ రాకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. పైనుంచి సుమారు అయిదు లక్షల క్యూసెక్కుల వరకు వరదనీరు వస్తుండటంతో అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు.

ఇటు కృష్ణ వద్ద సైతం నది ఉగ్రరూపం దాల్చింది. వాసూనగర్ వద్ద ఇప్పటికే ఉంటున్నవారికి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని అధికారులు సూచించారు. పసుపుల వద్ద సైతం కృష్ణమ్మ తల్లి విగ్రహం దాటి నది ప్రవహిస్తోంది. మరికాస్త ప్రవాహం పెరిగితే ఆలయ పరిసరాల్లోకి సైతం వరదనీరు వచ్చే ప్రమాదముందని అధికారులు తెలిపారు. ముందస్తుగా అందరికీ సమాచారమిచ్చి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు జూరా ల వద్ద దాదాపుగా మొత్తం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదు లుతుండగా శ్రీశైలం వద్ద సైతం నీటిని కిందకు వదులుతున్నారు. మక్తల్ పరిసర నదితీర ప్రాంతాలైన పంచదేవ్ పాడ్, పారేవుల, అనుగొండ, దాదన్ పల్లి, అంకెన్ పల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Krishna river received 4 lakh cusecs of flood water