Home తాజా వార్తలు చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య

చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య

famly-suside-image

మేడ్చల్ : జిల్లాలోని కీసర మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పెద్దమ్మ చెరువులోకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతులను ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ వాసులుగా గుర్తించారు.