Home తాజా వార్తలు ఈవెంట్ ఆర్గనైజర్ మహిళపై మూకుమ్మడి దాడి..

ఈవెంట్ ఆర్గనైజర్ మహిళపై మూకుమ్మడి దాడి..

 

హైదరాబాద్: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది బర్త్ డే సెలబ్రేషన్ ఏర్పాట్లకు ఓ ఈవెంట్ ఆర్గనైజర్ కు కాంటాక్ట్ ఇచ్చారు. బర్త్ డే సెలబ్రేషన్ లో ఫుల్ గా మద్యం సేవించిన నలుగురు నిందితులు ఈవెంట్ ఆర్గనైజర్ మహిళపై మూకుమ్మడి దాడి చేశారు. మద్యం మత్తులో రెచ్చిపోయిన నిందితులు బట్టలు విప్పి నగ్నంగా డ్యాన్స్ చేయాలని మహిళపై కత్తులతో బెదిరింపులకు దిగారు. అయినా.. డ్యాన్స్ చేయడానికి బాధితురాలు నిరాకరించడంతో రూమ్ లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తెల్లవారుజామున అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నలుగురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.

4 Men attack on Event Organizer Women at Rajendranagar