Home కామారెడ్డి ఎండలకు తాళలేక నాలుగు నెమళ్లు మృతి

ఎండలకు తాళలేక నాలుగు నెమళ్లు మృతి

Peacocksకామారెడ్డి : ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. పిట్లం మండలం నాగంపల్లి అటవీ ప్రాంతంలో ఎండ వేడిమితో నాలుగు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. స్థానిక ప్రజలు ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు నెమళ్ల కళేబారాలను స్వాధీనం చేసుకుని, పంచనామా చేశారు. అనంతరం వాటిని పాతిపెట్టారు.

4 Peacocks Dead with Hot Summer at Kamareddy