Home తాజా వార్తలు బుల్ జంప్

బుల్ జంప్

4 reasons why Sensex ended 639 points higher

 

639 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై : అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సె క్స్ 638.70 పాయింట్లు (1.22శాతం) లాభంతో 52,837.21 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 191 పాయింట్లు (1.23 శాతం) లాభంతో 15,824 వద్ద స్థిరపడింది. కొనుగోళ్లు వెల్లువెత్తడంతో 30 సెన్సెక్స్ స్టాక్స్ లో 26 షేర్లు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 50లో సుమారు 43 స్టాక్స్ లాభాల్లో కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 1.17 శాతం పెరగ్గా, స్మాల్ క్యాప్ సూచీ 1.49 శాతం జంప్ చేసింది. మార్కెట్ గ్యాప్ అప్‌తో ప్రారంభమైంది. అంటే గత రోజు కంటే ఎక్కువ పాయింట్ల పైన ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 16,000 పాయింట్లకు చేరు వ అవుతోంది. మార్కెట్ హెచ్చుతగ్గులపై సమాచారం ఇచ్చే ఇండియా విక్స్ 9.96 శాతం క్షీణించింది.

మార్కెట్లో బుల్ ఆధిపత్యం
మార్కెట్లో పతనం చూసిన తర్వాత అంతే స్థాయిలో బుల్ జంప్ చేస్తోంది. ఫ్యూచర్స్ మార్కెట్ ఒప్పందాలు నిఫ్టీ 15,600 నుండి 16,000 పరిధిలో ఉంటుందని సూచిస్తున్నాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్ 3 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటి, రియాల్టీ, మీడియా, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌మార్క్‌లోనే కనపించాయి. ప్రధానంగా టెక్ మహీంద్రా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టిలలో కొనుగోలు పెరగడ వల్ల మార్కెట్‌కు మద్దతు లభించింది.

మరోవైపు హెచ్‌యుఎల్, ఏసియన్ పెయింట్, బజాజ్ ఆటో, సిప్లా, బ్రిటానియా, ఎం అండ్ ఎం అమ్మకాల ఒత్తిడి వల్ల నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికన్, యూరోపియన్, ఆసియా స్టాక్ మార్కెట్లలో విజృంభణ ప్రభావం దేశీయ మార్కెట్లో కనిపించింది. ఆసియా మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.34 శాతం, కొరియాకు చెందిన కోస్పి 1.07 శాతం లాభంతో ముగిసింది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 1.84 శాతం జంప్ చేసింది.

ఎఫ్‌ఐఐ, డిఐఐ గణాంకాలు
ఎన్‌ఎస్‌ఇ సమాచారం ప్రకారం, జూలై 22న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) రూ. 247.59 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంటే కొనుగోలు చేసిన వాటాల కంటే చాలా ఎక్కువ విలువైన వాటాలను విక్రయించారు. ఇక దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐలు) రూ.942.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

4 reasons why Sensex ended 639 points higher today