Home జోగులాంబ గద్వాల్ అక్రమంగా తరలిస్తున్న పత్తి విత్తనాలు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పత్తి విత్తనాలు పట్టివేత

40 bags of illegal cotton seeds seized in gadwal

 

జోగులాంబ గద్వాల్: జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న పత్తి విత్తనాలను గురువారం తెలవారుజామున పట్టుకున్నారు. గద్వాల టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణం ధరూర్ మెట్టులో బుధవారం రాత్రి నుంచి గద్వాల పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం తెలవారుజామున ధరూర్ మెట్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏపి22టీఏ 7165 నంబర్‌గల డీసీయం వాహనం అనుమానస్పదంగా ఆగి ఉండటంతో గద్వాల పోలీసులు తనిఖీ చేయగా అందులో సుమారు 20 క్వింటాళ్ల పత్తి విత్తనాల బస్తాలు కనిపించాయి.

డీసీఎం వాహన డ్రైవర్ మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గద్వాల పట్టణానికి చెందిన ధర్మారెడ్డి జిన్నింగ్ మిల్లులో పని చేసే రఫిక్ అనే వ్యక్తి గాజుల శ్రీనివాస్‌కు చెందిన పత్తి విత్తనాలు రాయచూరు పట్టణానికి తీసుకపోవడానికి డీసీఎం వాహానా న్ని అద్దెకు తీసుకున్నట్లు, 40 సంచుల్లో సుమారు 20 క్వింటాళ్ల పత్తి విత్తనా లు రాయచూరుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీఎం వాహనంలో ఉన్న పత్తి విత్తనాల అనుమతి పత్రాలు చూపెట్టాల్సిందిగా పోలీసులు గాజుల శ్రీనివాస్ అనే వ్యక్తిని అడుగగా ఎలాంటి పత్రాలు చూపెట్టలేదు.

గద్వాల పట్టణంలోని ధర్మారెడ్డి జిన్నింగ్ మిల్లు నుంచి రాయచూరుకు పత్తి విత్తనాలు తరలిస్తున్నట్లు తెలుపడంతో డీసీఎం వాహనంతో పాటు డ్రైవర్‌ను, గాజు ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని గద్వాల పట్టణ పో లీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. గద్వాల మండల వ్యవసాయ అధికారిని సుచరిత సమక్షంలో గ ద్వాల సీఐ జక్కుల హన్మంతు, గద్వాల టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్ రెడ్డి, పోలీసులు అయిజ రోడ్డులోని ధర్మారెడ్డి మిల్లులో తనికీలు నిర్వహించగా సుమా రు 42 సంచుల్లో 26క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమాయక రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గద్వాల పోలీసులు తెలిపారు.

40 bags of illegal cotton seeds seized in gadwal district