Friday, March 29, 2024

కరోనా కాటు

- Advertisement -
- Advertisement -

poverty

 

కార్మికులు, ఉద్యోగుల బతుకు భారమే

కడు పేదరికంలోకి భారత్‌లో 40 కోట్ల మంది శ్రామికులు
ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల మంది ఉద్యోగాలు ఉఫ్?
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నివేదిక హెచ్చరిక

న్యూయార్క్: కరోనా వైరస్ దెబ్బతో భారతదేశంలో కనీసం 40 కోట్ల మంది శ్రామికులు నిరుపేదలయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఐరాస పరిధిలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) తన నివేదికలో తెలిపింది. అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం అవుతుందని తెలిపారు. విస్తరిస్తోన్న కరోనా తీవ్రస్థాయి ఉపద్రవాలకు దారితీస్తుం ది. కార్మికులు,
కూలీలు ఎక్కువగా ఉండే ఇండియా లో తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఐఎల్‌ఒ మానిటర్ సెకండ్ ఎడిషన్ పేరిట సంస్థ ఈ నివేదికను వెలువరించింది.భారతదేశంలో 90 శాతం వరకూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 40 కోట్ల మంది శ్రామికులకు ఉపాధిపోతుందని తెలిపారు. దీనితో వారి పేదరిక స్థాయి మరింతగా దిగజారుతుంది. ఇండియాలో లాక్‌డౌన్‌తో పరిశ్రమల మూసివేతతో పనిలేక అత్యధిక శ్రామికులు తమ సొంత ఊర్లకు తరలివెళ్లుతున్నారని తెలిపారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా ప్రభావంతో మొత్తం మీద 19.5 కోట్ల మంది ఉద్యోగాలు పోతాయి. మొత్తం పనివేళల్లో 6.7 శాతం ఆవిరవుతుందని, ఈ ఏడాది రెండో ప్రధమార్థంలో కరోనా పరిణామాలు కనబడుతాయని విశ్లేషించారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా పని విధానం, ఉద్యోగాలు, ఉపాధి వంటివాటిపై ఈ కార్మిక సంస్థ తగు అధ్యయనం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో అత్యంత భయానక స్థితిని కరోనా తెచ్చిపెట్టిందని తెలిపారు. యాజమాన్యాలకు, కార్మిక వర్గాలకు, ఉద్యోగులకు ముప్పు ఏర్పడింది. ఈ దేశం ఆ దేశం ఆర్థిక వ్యవస్థల తేడా లేకుండా అన్ని దేశాలపై ప్రస్తుత పరిస్థితి ఇబ్బందికరం అవుతుందని హెచ్చరించారు. ధనిక, వర్థమాన దేశాలన్ని కూడా ఫలితాలతో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఈ దశలో సంఘటితంగా, వేగవంతంగా , నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అస్థిత్వం, పతనం మధ్య దశలో ఉన్నామని, సత్వర, సముచిత నిర్ణయాలతోనే మనం ఏదనేది తేల్చుకోవచ్చునని ఐఎల్‌ఒ డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ తెలిపారు.

200 కోట్ల మంది కార్మికులకు ముప్పు..
కరోనా ప్రభావంతో అసంఘటిత రంగంలోని దాదాపు 200 కోట్ల మంది కార్మికులకు ముప్పు ఏర్పడుతుంది. వారికి సరైన పని దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకించి వర్థమాన, ప్రగతి దశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే కోటానుకోట్ల మంది కార్మికులకు సరైన పనిలేకుండా పోయిందని విశ్లేషించారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఎక్కువగా ఉండే ఇండియా, నైజిరియా, బ్రెజిల్ వంటి దేశాలలో ఇప్పటికే లాక్‌డౌన్, ఇతర నియంత్రణ చర్యలతో ఈ రంగం ఆర్థిక చిక్కుల్లో పడింది. 75 ఏండ్ల తరువాత ప్రపంచం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనిని ధైర్యంగా సంఘటితంగా ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏ దేశం అయినా ఈ దిశలో విఫలం అయితే మనమంతా దెబ్బతింటామని డైరెక్టర్ జనరల్ తెలిపారు.

 

40 crores of workers into poverty
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News