Home జాతీయ వార్తలు పౌర జాబితా కంపనలు

పౌర జాబితా కంపనలు

mamatha

అసోం జాతీయ పౌర రిజిష్టర్‌లో 40 లక్షల మంది గల్లంతు

అసోంలో నిషేధాజ్ఞలు రాజ్యసభలో భగ్గుమన్న టిఎంసి, సమాజ్‌వాది
సభ నేటికి వాయిదా

గౌహతి: అసోంలో స్థానికులు, స్థానికేతరులను గుర్తించడానికి వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేర కు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ముసాయిదాను సోమవారం నాడు విడుదల చేసింది. దీని ప్రకారం 3.29 కోట్ల జనాభా లో 2.89 కోట్ల మందికి పౌరసత్వం లభించింది. దాదాపు 40 లక్షల మందికి చోటు లభించలేదు. 1951 తర్వాత ఇటువంటి జాబితా విడుదల చేయడం ఇదే మొదటిసారి. అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ను ప్రచురించడంపై సోమవారం ప్రతిపక్షాలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్. సమాజ్‌వాది పార్టీలు గొడవ చేయడంతో రాజ్యసభ మూడు సార్లు వాయిదా వేసిన అనంతరం చివరగా రేపటికి వాయిదా వేశారు. జాబితా విడుదల చేయడానికి ముందు అసోంలో ఎలాంటి అల్ల ర్లు, ఆందోళనలు చెలరేగకుండా చూడడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించింది. బార్‌పేట్, దరంగ్, దిమా హసోవ్, శోణిత్‌పూర్, కరీంగంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాల్లో అధికారులు 144వ సెక్షన్‌తో పాటుగా నిషేధాజ్ఞలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సోమవారం ఉదయం పది గంటలకు స్థానికంగా ఉండే ఎన్‌ఆర్‌సి కేంద్రాల్లో జాబితాను అం దుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎన్‌ఆర్‌సి అసోం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు.1971 మార్చి 2 కు ముందు రాష్ట్రంలో ఉన్న వారిని మా త్రమే స్థానికులుగా గుర్తించడం జరిగింది. అయితే ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, తుది జాబితా కాదని, తుది జాబితాలో చేర్చని వారినుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఆగసు ్ట30 నుంచి సెప్టెంబర్ 28 దాకా స్వీకరించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. అంతేకాదు, జాబితాలో లేని వారిలో ఎవరిని కూడా రాష్ట్రంనుంచి పంపించి వేయడం లేదా అరెస్టు చేయడం జరగదని కూడా వారు తెలిపారు. అన్ని క్లెయిమ్‌లను పరిష్కరించిన తర్వాత మాత్రమే తుదిజాబితాను ప్రచురించడం జరుగుతుందని, దీనికి ఎలాంటి డెడ్‌లైన్ లేదని కూడా వారు తెలిపారు.‘ ఈ ముసాయిదా ఆధారంగా ఏ రెఫరెన్స్ కేసును కూడా విదేశీయుడి ట్రిబ్యునల్‌కు పంపించడం కానీ, డిటెన్షన్ సెంటర్‌లో ఉంచడం కానీ చేయరు’ అని కేంద్ర హోం శాఖలో ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌చార్జి అధికారి సత్యేంద్ర గార్గ్ స్పష్టం చేశారు. తుది జాబితాలో పేర్లు లేని వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచడం, లేదా, వెనక్కి పంపించి వేయడం చేస్తారు. లేదా పౌరసత్వం లేని వారుగా మారడంతో ఎలాంటి భూమి హక్కులు, రాజకీయ హక్కులు లేకుండా దీర్ఘకాలిక వర్క్ పర్మిట్‌లు మాత్రం పొందే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని పౌరులు, వారి నివాసాలు, ఇతర ఆస్తుల వివరాలను లెక్కించడం కోసం తొలిసారిగా 1951లో ఈ ఎన్‌ఆర్‌సిని చేపట్టిరు. అయితే ఆ తర్వాత రాష్టలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, ఇతర అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు సాగిన ఉద్యమం తర్వాత 1985లో కుదిరిన ఒప్పందం ప్రకారం వీరిని ఏరివేయడం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ జాబితాను అప్‌డేట్ చేయడం జరుగుతోంది. మరోవైపు తుది జాబితాలో చోటు దక్కని వారినుంచి ఎలాంటి నిరసన ఎదురుకాకుండాచూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేస్తోందితమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఎలా దాఖలు చేయాలో వారికి అవగాహన కల్పిస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందాలంటే రాష్ట్రంలోని నివాసులు తాము కానీ, తమ పూర్వీకులు కానీ 1951 నాటి ఎన్‌ఆర్‌సిలో ఉన్నట్లుగా కానీ, లేదా కటాఫ్ తేదీ వరకు నిర్వహించిన ఓటర్ల జాబితాలో కానీ ఉన్నట్లు సాక్షాధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్‌ఆర్‌సి నిష్పాక్షికంగా జరిగింది : రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: అసోంలో సోమవారం ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్( ఎన్‌ఆర్‌సి) నిష్పాక్షికమైనదని, ఈ జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి వారికి మరో అవకాశం ఇవ్వడం జరుగుతుందని కేంద్రం, అసోం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చాయి. సోమవారం అసోంలో ప్రచురించిన ఎన్‌ఆర్‌సి ముసాయిదాలో దాదాపు 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ విమర్శలపై స్పందిస్తూ ఆ పార్టీలపై మండిపడ్డారు. ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.‘జాబితాలో పేర్లు లేనంతమాత్రాన ఎవరిపైనా ఎలాంటి చర్య తీసుకోవడం జరగదు. అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ముసాయిదా మాత్రమే, తుది జాబితా కాదు’ అని రాజ్‌నాథ్ అన్నారు.
రాజ్యసభలో గొడవ, వాయిదా : కాగా, అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ను ప్రచురించడంపై సోమవారం ప్రతిపక్షాలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్. సమాజ్‌వాది పార్టీలు గొడవ చేయడంతో రాజ్యసభ మూడు సార్లు వాయిదా వేసిన అనంతరం చివరగా రేపటికి వాయిదా వేశారు. మూడు సార్లు వాయిదా పడిన తర్వాత సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరి గి సమావేశమైన తర్వాత కూడా గొడవ సద్దుమణగక పోవడంతో చైర్మన్ ఎం వెంకయ్య నాబుడు సఖను మంగళవారానికి వాయిదా వేశారు. అంత కు ముందు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఒబ్రియాన్ తాను ఈ అంశంపై ఇచ్చిన నోటీసుపై చర్చకు పట్టుబట్టారు. అయితే ఉదయం తాను చొరవ తీసుకుని హోంమంత్రిని సభకు పిలిపించానని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆయన సమాధానాన్ని వినడానికి కానీ, సభ సజావుగా నడవడానికి కానీ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ సభను మంగళవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలో సైతం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల సభ్యులు ఎన్‌ఆర్‌సిపై గొడవ చేశారు.