Home తాజా వార్తలు కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి

కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి

40 lambs killed in dog attack

మన తెలంగాణ / నాగర్ కర్నూల్/ ఆత్మకూర్ : ఒంటరిగా ఉన్న గొర్రె పిల్లలపై కుక్కలు ఏకకాలంగా దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృత్యువాత పడ్డాయి. మున్సిపల్ కేంద్రంలోని ఖానాపురం గ్రామానికి చెందిన కురువ నారాయణ వ్యవసాయ పొలంలో 40 గొర్రె పిల్లలను పెంచుకున్నాడు. రక్షణ కవచం మధ్య ఉన్న గొర్రె పిల్లలను ఎవరు లేని సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రె పిల్లల విలువ రూ.లక్షా 50వేలు ఉందని యజమాని కురువ నారాయణ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.