Home తాజా వార్తలు చేపలకు వల వేస్తే… 40 పాములు పడ్డాయి

చేపలకు వల వేస్తే… 40 పాములు పడ్డాయి

Snake

చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని ఓ చెరువులో మత్స్యకారులు చేపల కోస వలల వేశారు. పది గంటల తరువాత వలలను తీస్తుండగా చేపల కంటే పాములే ఎక్కువ పడడంతో భయాందోళనకు గురయ్యారు. చెరువు నుంచి వలను బయటకు తీసుకొచ్చి పరీక్షించగా పాములన్నీ చనిపోయి ఉన్నాయి. అవి నీటి పాములని స్థానిక మత్స్యకారులు తెలిపారు. పాములను లెక్కించి చూడగా 40 వరకు ఉన్నాయని మత్స్యకారులు తెలిపారు. పాములను రక్షించేవారు ఒకే సారి 40 పాములు చనిపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ పాములను అటవీ ప్రాంతంలో ఉన్న జలాశయాల్లో విడిచిపెట్టేవాళ్లమని తెలిపారు. 

 

 

40 Snake Caught in Net for Fish in Suryapet