Home జాతీయ వార్తలు 400 మంది కశ్మీర్ యువకులు ఆర్మీలో చేరిక

400 మంది కశ్మీర్ యువకులు ఆర్మీలో చేరిక

Indian Army

 

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌కు చెందిన 401 మంది యువకులు ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసిన తరువాత ఆర్మీలోకి శనివారం నియామకమయ్యారు. జమ్ముకశ్మీర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన నైనికులు రంగ్రెథ్ వద్ద జమ్ముకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ (జెఎకెఎల్‌ఐ) రెజిమెంటల్ సెంటర్ వద్ద పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించిన సందర్భంగా ఈ నియామకం జరిగింది. శ్రీనగర్ కేంద్రమైన చినార్ కార్పొకు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఒసి) లెఫ్టినెంట్ జనరల్ కెజెఎస్ థిల్లాన్ ఈ పెరేడ్‌ను సమీక్షించారు.

కొత్తగా నియామకమైన వారిని అభినందిస్తూ దేశానికి నిస్వార్థ సేవలు అందించడంలో కీలక పాత్ర వహించాలని సూచించారు. సర్వీస్ నుంచి రిటైరైయినప్పటికీ ప్రజల బాగోగుల కోసం కొనసాగుతున్న జెఎ కెల్‌ఐ గౌరవ కెప్టెన్ ఇయాస్ అహ్మద్‌ను కమాండర్ సత్కరించారు. మంచుచరియల ఆపద నుంచి బాధితులను రక్షించడం అహ్మద్ ప్రత్యేకత అని, రెండు సేవా పతకాలు ఆయన పొందారని, ఐదు సార్లు ఆర్మీ చీఫ్ చే కమెండేషన్ కార్డు పొందారని టాంగ్‌ధర్ కుప్వారా నుంచి వచ్చిన సాహస జవాను అని థిల్లాన్ ప్రశంసించారు.

400 youths from Jammu and Kashmir inducted into Army