Friday, March 29, 2024

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 4 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

4000 crore to strengthen Govt schools

సిద్దిపేట: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సిఎం కెసిఆర్ రూ. 4 వేల కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆయన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించడంతో పాటు నియోజక వర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 270 విద్యా కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కెసిఆర్ విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేశారన్నారు. సిద్దిపేట ఇందిరా నగర్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌లో ప్రస్తుతం 1040 అడ్మిషన్‌లు పూర్తి కాగా మరో 270 ఆడ్మిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ పాఠశాలలో ఆడ్మిషన్‌ల కోసం కొంత మంది తన వద్దకు ధరఖాస్తులు తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు.

ఇక్కడ చదువు చెప్పే ఉపాద్యాయుల పిల్లలు సైతం ఇదే పాఠశాలలో చదవడం సంతోషకరమన్నారు. కార్పోరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యాభోదన లభించడంతోనే ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో డిమాండ్ పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కావల్సిన టీచర్, సిబ్బంది వసతులు కల్పిస్తున్నామన్నారు. అతి త్వరలోనే సిద్దిపేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు 15 మంది టీచర్లను నూతనంగా నియమించడం జరుగుతుందన్నారు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాద్యాయుల బృందం విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ద చూపిస్తున్నారన్నారు. విద్యార్థులు సైతం పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అవరోదించాలన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలోని 6 వేల మంది చిన్న పిల్లలకు త్వరలోనే పోట్రిన్ మిక్స్ పౌడర్ ను ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు.

చేసిన కష్టానికి సమాజంలో గుర్తింపులభిస్తే ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. సత్యసాయి ట్రస్టు , ఈపం సంస్థల సహాకారంతో ఉచిత నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే డిజిటల్ తరగతిని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఈపం సంస్థ డైరక్టర్ శాంతికుమార్ , సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు రాంమూర్తి, మోటా, రాంప్రసాద్, సుడా డైరక్టర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ రామస్వామి, కౌన్సిలర్ ఆలకుంట కవిత, నాయకులు ఆలకుంట మహేందర్, సుభాష్, జోజి, లక్ష్మన్, ప్రభాకర్‌వర్మ, భీమసేన తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News