Home నిర్మల్ 41 గ్రామాలు… 4గురే కార్యదర్శులు

41 గ్రామాలు… 4గురే కార్యదర్శులు

41 villages ... 4 Guy secretaries

ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు గ్రామస్థాయిలో గ్రామ కార్యదర్శులను నియమించింది.   వారు ప్రభుత్వ పరమైన సేవలు ప్రజ లకు అందించడంతో పాటు ప్రభుత్వ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసు కొని ప్రజలకు సహాయ పడతారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలను  అర్హు లైన వారికి అందించేందుకు సరిపడ సిబ్బంది ఉంటేనే సాధ్యమవుతుంది. కాని గ్రామస్థాయిలో సరిపడ సిబ్బంది లేక పోవడంతో ప్రభుత్వ లక్షం నెర వేరలేక పోతుంది. ఉన్న సిబ్బందికి 1, 2 గ్రామాలకు బదులు 9, 10 గ్రామాల అదనపు బాధ్యతలను కేటా యించడంతో ఏ గ్రామానికి న్యాయం చేయలేక పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

మనతెలంగాణ/కుబీర్ :  ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండల వ్యాప్తంగా గతంలో 20 గ్రామ పంచాయతీలుండగా ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన 21 గ్రామ పంచాయతీలను కలుపుకొని 41 గ్రామ పంచాయతీలుగా ఏర్పడాయి. అయితే వివిధ గ్రామాలలో మండల పరిషత్ ద్వారా ప్రజలకు సేవలు అందిచేందుకు గ్రామ పంచాయతీకి ఒక్కరు చొప్పున గ్రామ కార్యదర్శులు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో ఉన్నత స్థాయి అధికారులు ఒక కార్యదర్శికి ఎనిమిది నుంచి తొమ్మిది గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో అధికారులు ప్రతి రోజు అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు సేవలు అందించ లేక పోతున్నారు. అంతేకాకుండా త్వరలో నిర్వహించనున్న గ్రామ పం చాయతీ ఎన్నికలకు అవసరమైన ఓటరు లిస్టు వార్డులు సరి చేసి ఇవ్వాల్సి రావడంతో  ఆ పనిని నెల రోజుల నుంచి నిర్వహిస్తున్నామని అన్నారు. దీంతో గ్రామాలలో ప్రజలకు అవసరమైన జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాలను, ఇండ్ల నిర్మాణాలకు అనుమతి, మంచి నీటి సరాఫరా, వీధులు, మురికి కాలువల శుభ్రత సకాలంలో చేయించలే కపోతున్నారు. ఇదేమిటని ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు ప్రశ్నించడంతో తాము రెండు గ్రామాల్లో చేయాల్సిన పనులు 9, 10 గ్రామాలలో చేస్తే ఎలా సాధ్యం అవుతుందని, దశల వారీగా చేస్తామని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మండలంలో అవసరమైన కార్యదర్శులను నియమించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం: మండలాభివృద్ధి అధికారి దేవేందర్ రెడ్డి

మండలంలో గ్రామ పంచాయతీలలో సరిపడా పంచాయతీ కార్యదర్శులు లేని మాట వాస్తవమే ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కార్యదర్శులు సరిపడా లేకున్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం.

పని ఒత్తిడి పెరిగింది: పంచాయతీ కార్యదర్శి కిషోర్ 

ఒకటి రెండు గ్రామాలకు అందిచాల్సిన సేవలు 9, 10 గ్రామాలకు అంది చాల్సిరావడంతో పని ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రజలకు సరైన సమ యంలో సేవలు అందించ లేక పోతున్నాం. గతంలో మాదిరిగా ఒకటి రెండు గ్రామాలు మాత్రమే కేటాయిస్తే బాగుండు.