Home జాతీయ వార్తలు తమిళనాడులో కరోనా కరాళ నృత్యం : ఒక్క రోజులోనే 68 మంది మృతి

తమిళనాడులో కరోనా కరాళ నృత్యం : ఒక్క రోజులోనే 68 మంది మృతి

4244 New Corona Cases in Tamil Nadu in Single Dayచెన్నయ్ : తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నయ్ సహా ఐదు జిల్లాల్లో రెండోసారి లాక్ డౌన్ విధించారు. అయినప్పటికీ కరోనా ఉధృతి తగ్గలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయింది. గడిచిన ఒక్క రోజులోనే తమిళనాడులో 4,244 కరోనా కేసులు నమోదయ్యాయి. 68 మంది కరోనాతో చనిపోయారు. 3,617 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,38,470 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 46,969 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో  1,966 మంది చనిపోయారు.