Wednesday, March 22, 2023

రాష్ట్రంలో 43 లక్షల గొర్రెల పంపిణీ

- Advertisement -

cc*గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం
*ఈ వేసవిలో 71 కోట్ల చేపపిల్లల విడుదలకు ప్రణాళిక
*రాష్ట్ర పశుసంవర్ధక, మత్సశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కింద గొల్ల, కురుమలకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 8 వేల 400 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్సశాఖల మంత్రి తలసా ని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల 76 వేల 400 జీవాలను పంపిణీ చే శామన్నారు. ఇందుకోసం 2 వేల 600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.  రూ.5 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తుందన్నారు. 70 సంవత్సరాలుగా పేదరికంలో ఉన్న పశుసంవర్ధక, మత్సశాఖలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చొరవతో ధనిక శాఖలుగా అభివృద్ధి చెందాయన్నారు. జిల్లాలోని సంచార పశువైద్య అంబులెన్స్‌ల పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు. రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. స్టైలో పశుగ్రాసం పెంపకాన్ని విరివిరిగా ప్రోత్సహించాలని తెలిపారు. 75 శాతం సబ్సిడిపై అందిస్తున్న పశుగ్రాసం పెంపకంపై రైతులకు అవగాహన కలిపించి సొంతగా భూమి ఉన్న రైతులు గ్రాసాన్ని పెంచుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. అదేవిధంగా ఇరిగేషన్, హార్టికల్చర్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. వేసవిలో పశుగ్రాసం నీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో గొర్రెలకు నీటి తొట్ల నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 90 శాతం సబ్సిడిపై గొర్రెల షెడ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకునేలా చూ డాలన్నారు. మత్సకారుల కుటుంబాలకు చే యూ త ఇచ్చేందుకు ఈ సంవత్సరం 51 కోట్ల చేప పిల్లలను రిజర్వాయర్‌లు, చెరువులలో విడుదల చేయ డం జరిగిందని, ఈ ఏడాది 77.29 కోట్ల చేప పిల్లల లక్షం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకు జిల్లాలకు నిర్దేశించుకున్న లక్షాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సంవత్స రం ప్రయోగాత్మకంగా 11 రిజర్వాయర్‌లలో రొ య్యల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. చేపల విక్రయాల కోసం హోల్‌సేల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని ఇందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో నేటి వరకు 8095 గొర్రెల యూనిట్లు పంపిణీ చే శారు. జిల్లాలో వచ్చే ఏడాది 2.65 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రణాళికలు రూపొందించారు.
హైదరాబాద్ నుంచి పశుసంవర్దక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్సశాఖ కమిషనర్ సు వర్ణ, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమా ఖ్య ఎండి లకా్ష్మరెడ్డిలు పాల్గొనగా జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్‌లు ఎం.హరిత, ఎస్.దయానంద, పశుసంవర్ధకశాఖ జెడి వెంకయ్యనాయుడు, మత్స శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News