Friday, April 26, 2024

మతాంతీకరణకు పాల్పడిన పాస్టర్ జైలుపాలు

- Advertisement -
- Advertisement -

రామ్‌పూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన 43 ఏళ్ల పాస్టర్ పౌలస్ మసీహ్‌ను అరెస్టుచేసి జైలుకు పంపారు. క్రిస్మస్‌కు ఓ రోజు ముందు రామ్‌పూర్ జిల్లాలోని 100 మందిని క్రైస్తవులుగా మతాంతీకరణ చెందమని ప్రోత్సహించినందుకు ఆయన్ని అరెస్టు చేశారు. పట్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్న గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

రామ్‌పూర్‌కు చెందిన పౌలస్ మసీహ్ ఆరుబయట క్రైస్తవ కూటమిని నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అందులో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు క్రైస్తవులు కావడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఇదిలావుండగా తమ ప్రార్థనలు ఎవరి భావాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినవి కావని ఆయన తర్వాత తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ అక్రమ మతాంతీకరణ నిషేధ చట్టం 2021లోని సెక్షన్ 3, 5ల కింద అతడిపై కేసు బుక్‌చేశారు. రైట్‌వింగ్ కార్యకర్త రాజీవ్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఆ పాస్టర్‌ను అరెస్టు చేశారు. పాస్టర్‌ను జైలుకు కూడా పంపారు. ఆ క్రైస్తవ కూటమి కార్యక్రమానికి అనుమతి కూడా తీసుకోలేదని తెలిసింది.

Pastor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News