Wednesday, April 24, 2024

వాసవీ, సుమధుర గ్రూప్స్ భాగస్వామ్యంతో ఒలింపస్ ప్రాజెక్టు….

- Advertisement -
- Advertisement -

గ్రేటర్‌లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్స్ ద ఒలింపస్ ప్రాజెక్టు ఆవిష్కరణ
గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, వేవ్ రాక్ సమీపంలో
44 అంతస్తుల టవర్ల నిర్మాణం ప్రారంభం
5.06 ఎకరాల విస్తీర్ణంలో 20 లక్షల చదరపు అడుగుల విక్రయం
854 లగ్జరీ యూనిట్లను
3 బిహెచ్‌కె, 3.5 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్‌లుగా
1670 చదరపు అడుగుల నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందజేత
రూ.1000 కోట్ల పెట్టుబడి.. డిసెంబర్ 2025 నాటికి పూర్తి

 

మన తెలంగాణ/హైదరాబాద్: వాసవీ గ్రూప్ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్ తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన ద ఒలింపస్ రెసిడెన్సియల్ ప్రాజెక్ట్‌ను గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా వద్ద ప్రారంభించింది. దాదాపు. 5.06 ఎకరాల విస్తీర్ణంలో, ప్రతి ఒక్కరూ నివాసముండాలని కోరుకుం టున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన వేవ్‌రాక్ ఐటీ సెజ్ సమీపలో ఈ ప్రాజెక్ట్ వుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తమ్మీద 20 లక్షల చదరపు అడుగులను విక్రయించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన టవర్లుగా ఇది నిలువడంతో పాటుగా 854 లగ్జీ యూనిట్లను 3 బీహెచ్‌కె, 3.5 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్‌లుగా 1670 చదరపు అడుగుల నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందించనున్నారు. ద ఒలింపస్ నగరలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది.

ఇది నివాసితులకు సౌకర్యవంతమైన కనెక్టివిటీని నగర వ్యాప్తంగా అందిస్తుంది. ఈ ప్రాపర్టీని ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు. ఇది నివాసితులకు సమగ్రమైన జీవనశైలి అనుభవాలను అత్యాధునిక, ప్రపంచశ్రేణి వసతులైన దాదాపు 50 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్‌తో అందించనుంది. జీస్ పేరిట రూపుదిద్దుకోనున్న ఈ క్లబ్ హౌస్‌లో కో వర్కింగ్ వర్కింగ్ ప్లేస్‌లు, కేఫ్, లైబ్రరీ, స్విమ్మింగ్‌ఫూల్, గెస్ట్ సూట్స్ మొదలైన, బీబీక్యు టెర్రాస్, స్పోర్ట్ బార్, జిమ్, బ్యాడ్మింటన్ కర్టు, స్కాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, స్పా, సలోన్ వంటివెన్నో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచశ్రేణి సదుపాయాలున్నాయి. వీటిలో సెంట్రలైజ్డ్ ఎసి కూడా భాగంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం గురించి సుమధుర గ్రూప్ చైర్మన్ జి.మధుసూదన్ మాట్లాడుతూ ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆహ్లాదకరమైన జీవితం కోరుకునే వ్యక్తులు, కుటుంబాల అవసరాలను పరిగణనలోనికి తీసుకుని ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాజెక్ట్ విశ్రాంతి, పునరుత్తేజ అనుభవాలను పొందడానికి అవసరమైన సదుపాయాలు, ప్రాంగణాన్ని అందిస్తుంది.

డిమాండ్‌తో కూడిన జీవనశైలి, ప్రియమైనవారితో మధురక్షణాలను ఆస్వాదించాలనుకునే వారికి ఆహ్లాదకరమైన అనుభూతులను అందించే అత్యుత్తమ ప్రాపర్టీలలో ఒకటిగా ద ఒలింపస్ నిలువనుంది. మా కొనుగోలుదారులకు కచ్చితంగా ఇది అత్యంత గర్వకారణమైన ఎంపికగా నిలువడమే కాదు తరాల తరబడి ఆనందాన్ని అందించనుంది’ అని అన్నారు. అదనంగా ఈ ప్రాజెక్టు యొక్క అతి పెద్ద ప్రయోజనం, ఇది ఉన్న స్థానం. వేవ్‌రాక్ సెజ్‌కు పక్కనే ఉండటం, ఎన్నో ఎంఎన్‌సిలు మీటర్ల దూరంలో ఉండటం, హైదరాబాద్ నగర అత్యద్భుత వీక్షణం ఈ ప్రాజెక్టును మరింత ఆహ్లాదంగా మారుస్తాయి. సుప్రసిద్ధ ఎంఎన్‌సిలు, ఆసుపత్రులు, ఔటర్ రింగ్, పాఠశాలలు, విద్యా సంస్థలు, క్రీడా సదుపాయాలు, ఇతర అవసరమైన మౌలిక వసతులకు అతి సమీపంలో ఇది ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News