Friday, July 11, 2025

ఇరాన్ నుంచి 4400 మంది భారతీయుల తరలింపు

- Advertisement -
- Advertisement -

జూన్ 18 ప్రారంభించిన ఆపరేషన్ సింధు కింద ఇప్పటి వరకు 4400 మంది భారతీయులను ఇరాన్ నుంచి భారత్ తరలించింది.ఇందుకు 19 ప్రత్యేక విమానాలను నడిపింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారతీయులను ఇలా తరలించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తాజాగా 173 మంది భారతీయలు ఇరాన్ నుంచి ఢిల్లీకి గురువారం రాత్రి చేరుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. భారతీయుల తరలింపు వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ వేదికలో పంచుకున్నారు. అది కూడా యెరావన్ నుంచి విమానం వచ్చాక.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News