Home తాజా వార్తలు టిక్‌టాక్‌కు రూ.44,807 కోట్ల నష్టం

టిక్‌టాక్‌కు రూ.44,807 కోట్ల నష్టం

44,807 crore loss to TikTok ban in India

 

బీజింగ్ : చైనాకు చెందిన టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ లిమిటెడ్‌కు చెందిన మూడు యాప్‌లలో టిక్‌టాక్ భారత్‌లో ఎంతో పాపులర్ అయింది. ఈ కంపెనీకి చెందిన మూడు యాప్‌లను భారత్ నిషేధించడంతో 6 బిలియన్ డాలర్లు (రూ.44,807 కోట్లు) నష్టం రానుందని అంచనా వేసినట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ సంస్థకు చెందిన మరో రెండు యాప్‌లు విగో వీడియో. హాలో ఇవి కూడా ఎంతో పాపులర్ అయినవే.

దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, డేటా భద్రతకు ముప్పు ఉందనే కారణంతో భారత ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించింది. భారత్‌లో చైనా యాప్‌ల నిషేధంతో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే నష్టం ఉండనుందని బైట్ డాన్స్ సీనియర్ మేనేజర్ చెప్పినట్టుగా చైనాకు చెందిన కైషిన్ గ్లోబల్.కామ్ పేర్కొంది. బైట్ డాన్స్ చైనాలో అతిపెద్ద ఐటి సంస్థ, విదేశాల్లో ఈ సంస్థకు పెట్టుబడులు పెడుతుంది.

44,807 crore loss to TikTok ban in India