Home తాజా వార్తలు భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్

భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్

మనతెలంగాణ/మన్సూరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకోండ కమిషన్‌రేట్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన అబ్దుల్‌పూర్‌మెట్, సరూర్‌నగర్ ఠాణాలలో పరిధిలో, ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు సంయుక్తంగా అక్రమంగా తరిలిస్తున్న రూ.54,49,0000 లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకోని ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండుకు తరిలించారు. ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాచకోండ కమిషనర్ మహేష్ భగవత్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. సూర్యాపేట్ జిల్లా సోలిపేట గ్రామానికి చెందిన రమవత్ పాండు(22) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తేటికుండ తండాకు చెందిన వర్యాత్ భాస్కర్(23), హయత్‌నగర్ గజ్జి స్వామి కాలనీ నివాసం ఉంటూ వ్యాపారం చేస్తుంటాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పెద్దగుట్ట తండాకు చెందిన కీర్తవత్ ప్రకాష్(37) హయత్‌నగర్ గజ్జి స్వామి కాలనీ నివాసం ఉంటూ వ్యాపారం చేస్తుంటాడు. విశాఖ పట్నంకు చెందిన కోర్ర వాసు, సురేష్ లు గంజాయి అమ్మకం దారులు. మహరాష్ట్రకు చెందిన కరాన్ పార్కేలే గంజాయి కోనుగోలు దారుడు. కోర్ర వాసు, సురేష్,  కరాన్ పార్కేలే పరారీలో ఉన్నారు. రమావత్ పాండు వద్ద వర్యాత్ భాస్కర్, కీర్తవత్ ప్రకాష్ లు కారు అద్దెకు తీసుకోని అక్రమంగా వ్యాపారం చేయాలని పన్నాగం పన్నారు.

దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో విశాఖ పట్నంలో గంజాయి అమ్మకాదారులను సంప్రదించగా.. రూ.3000 కిలో గంజాయి ఇస్తానని వాసు, సురేష్‌లు తెలిపారు. విశాఖపట్నం ధనవాడలో 10 కిలోల గంజాయి(30 ప్యాకెట్లు)ని కోనుగోలు చేసి అబ్దుల్ పూర్ మెట్ పరిధిలో దేశ్‌ముఖ్ వద్ద మహేంద్ర ఎక్స్‌యువి 500 టిఎస్ 12 ఈజి 9521 వాహనంలో మహరాష్ట్రకు తరిలిస్తుండగా ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు, అబ్దుల్‌పూర్‌మెట్ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందుకోని దాడి చేసి కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.1, 49,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

450 kg Marijuana Seized by LB Nagar Police