Friday, March 29, 2024

చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
Article about India-China Standoff
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం లేదు. గత నెల గాల్వాన్ లోయ వద్దనే మనకన్నా వారి సేనలు పలు రెట్లు ఉన్నప్పటికీ, దాడికి ముందే ఇనుప కడ్డీలు వంటి వాటిని సిద్ధం చేసుకున్నా మన సేనల పరాక్రమం ముందు నిలబడలేక పోయారు. పైగా, పర్వత పోరాట యోధులలో భారతీయులకు ఉన్న ప్రత్యేక శిక్షణ పొందిన సేనలు సంఖ్యలో గాని, పరాక్రమంలో గాని చైనా, అమెరికా పోటీ పడలేవని చైనా సైనిక నిపుణుడు ఒకరు గత నెల చైనా సైనిక పత్రికలోనే వ్రాయడం గమనార్హం.

గాల్వన్ లోయ వద్ద చైనా సేనలు జరిపిన దురాక్రమణ, మన సైనికులతో జరిగిన ఘర్షణలో మనం 20 మంది సేనలు కోల్పోవలసి రావడం యాదృచ్ఛికంగా జరిగిన ఏదో ఒక సంఘటన కాదు. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే మేటి నిరంకుశ పాలకుడిగా పేరొందిన చైనా అధ్యక్షుడు జి జింగ్ పింగ్ విస్తరణ వాదంలో ఒక చిన్న అంశం మాత్రమే. వాస్తవానికి సుమారు సంవత్సర కాలంగా చైనా ఇటువంటి కవ్వింపు చర్యలకు మన సరిహద్దులలో పాల్పడుతున్నది. పలు చోట్ల మన భూభాగాలలోకి చొచ్చుకు వచ్చి విన్యాసాలు చేస్తున్నాయి. చివరకు ఎటువంటి సరిహద్దు వివాదం లేని సిక్కిం ప్రాంతంలో కూడా చొరబడ్డాయి. అయితే మన ప్రభుత్వ అధినేతలకు వాటి గురించి పట్టించుకొనే తీరిక చిక్కడం లేదు.
కానీ, 45 సంవత్సరాల తర్వాత తొలిసారిగా సేనలు మృతి చెందడంతో మొత్తం దేశ ప్రజలు గగుర్పాటుకు గురయ్యారు. చైనా పట్ల ఆవేశంతో ఊగిపోతున్నారు. చైనా వస్తువులను బహిష్కరణకు సిద్ధపడుతున్నారు. పాకిస్థాన్ వంటి ఒక అస్థిర దేశం చైనా కాదని గమనించాలి. నిర్దిష్ట లక్ష్యాలతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నది. మన దేశంలో అటువంటి దూరదృష్టితో, ప్రణాళికాయుతంగా అడుగులు వేయగల ప్రభుత్వం లేదని గ్రహించాలి. ప్రజల భావావేశాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, చైనా దూకుడును ఏ విధంగా కట్టడి చేయాలో ఆలోచించాలి. ఈ సందర్భంగా దేశంలో వివిధ వర్గాల వారికి అనేక ప్రశ్నలు తలెత్తడం సహజం.

ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టే వారిని ‘దేశ ద్రోహులు’, ‘చైనా ఏజెంట్లు’ అంటూ నిందించడం వల్లన ప్రయోజనం ఉండదు. మొత్తం జాతిని విశ్వాసంలోకి తీసుకోవాలి. 1962లో నాటి ప్రధాని పండిట్ నెహ్రూ భావావేశం దేశానికి ఎటువంటి అనర్ధం కలిగించిందో, ఇప్పుడు మరో నష్టం జరుగకుండా జాగ్రత్త పడాలి. చైనాతో మన యుద్ధం కేవలం సరిహద్దుల్లో, సైనికుల మధ్యకు పరిమితం కాబోదు. వాస్తవానికి 1979లో వియత్నం వంటి ఒక చిన్న దేశంతో జరిగిన యుద్ధంలో ఘోర పరాజయం పొందిన తర్వాత మరే దేశంపై యుద్ధానికి దిగే సాహసం చైనా చేయలేదు. ముఖ్యంగా భారత్ వంటి దేశంపై అసలే చేయలేదు.
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం లేదు. గత నెల గాల్వాన్ లోయ వద్దనే మనకన్నా వారి సేనలు పలు రెట్లు ఉన్నప్పటికీ, దాడికి ముందే ఇనుప కడ్డీలు వంటి వాటిని సిద్ధం చేసుకున్నా మన సేనల పరాక్రమం ముందు నిలబడలేక పోయారు.
పైగా, పర్వత పోరాట యోధులలో భారతీయులకు ఉన్న ప్రత్యేక శిక్షణ పొందిన సేనలు సంఖ్యలో గాని, పరాక్రమంలో గాని చైనా, అమెరికా పోటీ పడలేవని చైనా సైనిక నిపుణుడు ఒకరి గత నెల చైనా సైనిక పత్రికలోనే వాయడం గమనార్హం. అయితే సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, భారీ నిర్మాణాలు చేబడుతూ మనలను కట్టడి చేసే ప్రయత్నాలు చైనా చేస్తుంటుంది. నేడు చైనా దుష్ట సంకల్పాన్ని మొత్తం ప్రపంచం గుర్తిస్తున్నది. ప్రజల జీవితాలపై పూర్తి నియంత్రణ కావాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ కోరుకొంటున్నది. అంటే ఆర్ధిక నియంత్రణ, రాజకీయ నియంత్రణ, భౌతిక నియంత్రణ మాత్రమే కాదు. బహుశా చాలా ముఖ్యమైన ఆలోచన నియంత్రణ అంటూ వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ సి ఒ బ్రెయిన్ ఈ మధ్య ఒక హెచ్చరిక చేశారు. ఈ మధ్యనే అమెరికాలో ప్రముఖ మీడియా సంస్థలపై బిలియన్ల కొలది డాలర్లు ఖర్చు పెట్టి వాటిల్లో తమకు అనుకూలంగా కథనాలు వచ్చేటట్లు చైనా ఏ విధంగా ప్రయత్నిస్తున్నదో వెల్లడైనది. మన దేశంలో కూడా చైనా అటువంటి ప్రయత్నాలు దీర్ఘకాలంగా చేస్తున్నది. నేడు బిజెపి ఆరోపణలు చేస్తున్నట్లు కేవలం కాంగ్రెస్ నేతలు, వారి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మాత్రమే కాదు అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా నిధులు అందుతున్నాయి.

బిజెపికి సహితం చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమిత్ షా బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చైనాకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా పని చేస్తుందో పరిశీలించమని కోరారు. ఆ పార్టీని సభ్యత్వంలో బిజెపి అధిగమించడంతో ప్రారంభించిన అమిత్ షా నేడు ఆ పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ విధానాల నుండి కూడా ప్రేరణ పొందుతున్నట్లు భావించవలసి వస్తున్నది. మన ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను 16 నుండి 18 సార్లు గత ఆరేళ్లలో కలిశారు. బహుశా భారత అధినేతలు ఎవ్వరూ చైనా అధినేతలతో అన్నిసార్లు సమావేశాలు జరుపలేదు.
ఈ సమావేశాల ద్వారా మోడీ సాధించింది ఏమిటో తెలియదు గాని, ఆయనలోని బలహీనతలు అన్నింటిని జింగ్ పింగ్ గ్రహించినట్లు ఆయన వ్యవహారం కనిపిస్తున్నది. ఈ విషయం లో ఒక విధంగా భారత దేశం వ్యూహాత్మకంగా, వాస్తవికంగా వ్యవహరించడం లేదని పిస్తుంది. నేడు ప్రజల భావావేశాలు గ్రహించి చైనా యాప్‌లను నిషేధించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఆరేళ్ళు పట్టిందా? చైనా వస్తువుల దిగుమతులను రద్దు చేసే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను సిద్ధం చేసే ప్రయత్నాలు ఇంతకాలం ఎందుకు సాగలేదు? చైనాతో వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉండడం జాతీయ భద్రతకు ప్రమాదకరమని జాతీయ భద్రతా సలహాదారుడు 2014లోనే హెచ్చరించారు. అప్పటి నుండి వాణిజ్య లోటు తగ్గించడం కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొంది? ఔషధ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి మన పరిశ్రమల మనుగడకు చైనా దిగుమతులు అవసరమో, అసలే తీవ్రమైన ఆర్ధిక సమస్యలు, నిరుద్యోగం ఎదుర్కొంటున్న చైనాకు కూడా భారత్ మార్కెట్‌లో అంతే కీలకమైనవి. భారత మార్కెట్‌ను కోల్పోతే మొత్తం ప్రపంచ దేశాల మార్కెట్ పొందినా ఆ నష్టం భర్తీ చేసుకోలేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటె ఇప్పటికే ఎంతో ముందడుగు వేసిఉండేవాళ్ళం.

ఆధునిక ప్రపంచంలో అంతర్జాతీయ వాణిజ్యం ఏ దేశ అభివృద్ధికైనా కీలకమైనది. చైనాతో నిత్యం వివాదాలతో సతమతమవుతున్న జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు సహితం ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వినిపిస్తున్న చైనా వ్యతిరేక పల్లవి మరో కొద్ది నెలల్లో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే. ఎన్నికల తరవాత అమెరికా వైఖరి ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. అందుకనే మనం మన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మన విధానాలను రూపొందించుకోవాలి.
మన పరిశ్రమలను, ముఖ్యంగా తయారీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి పదేళ్ల నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. అయితే భారత ప్రభుత్వం మొదటి నుండి విధానపరమైన పక్షవాతాన్ని ఎదుర్కొంటున్నది. ఉద్వేగ పూర్తిగా విధానాలకు ఇస్తున్న ప్రాధాన్యత దీర్ఘకాలిగా వ్యూహాలకు ఇవ్వడం లేదు. ‘దాడిని ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నదో లేదో మన ప్రధానికి తెలుసా? భారత భూభాగం నుండి చైనా సేనలను గెంటి వేయమని భారత సేనలను ఎందుకు ఆదేశింపలేక పోయారో ఆయనకు తెలుసా? …. తగినంత మంది సేనలతో సరిహద్దు ఎందుకని సురక్షితంగా లేదు? వారికి తగినన్ని ఆయుధాలు లేవా? ఈ విషయాలన్నీ ఆయనకు తెలియని పక్షంలో తెలియనీయకుండా ఆయనను ఉంచినదెవ్వరు?’ ఈ ప్రశ్నలు వేసింది రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ లేదా సీతారాం ఏచూరి కాదు. నవంబర్ 9, 1962న లోక్‌సభలో ఒక యువ ఎంపి తనకన్నా వయస్సులో రెండు రెట్లు పెద్దవారైన ప్రధాని నెహ్రూ (72)పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనే నాటి జనసంఘ్ నేత వాజపేయి. ఆ విధంగా పారదర్శకంగా సమాలోచనలు ముందుగా అవకాశం కల్పించాలి.

                                                                                               చలసాని నరేంద్ర
                                                                                                9849569050

Article about India-China Standoff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News