Home Default కరోనా ఎఫెక్ట్ : తమిళనాడులో ఒక్కరోజే 46మంది మృతి

కరోనా ఎఫెక్ట్ : తమిళనాడులో ఒక్కరోజే 46మంది మృతి

46 People Died With Corona in Oneday at Tamil Naduచెన్నయ్ : గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కరోనాతో 46 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,523 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,622కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో 957 మంది మృత్యువాత పడ్డారు. ఈ రాష్ట్రంలోయాక్టివ్ కేసుల సంఖ్య 32,305గా ఉంది. రాష్ట్ర రాజధాని చెన్నయ్ లో అధికంగా 47,650 కరోనా కేసులు నమోదు కాగా, చెంగల్ పట్టులో 4,407, తిరవల్లూరులో 3,085, కంచీపురంలో 1488, తిరువన్నమలైలో 1428 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చెన్నయ్ తో సహా చెంగల్ పట్టు, తిరవల్లూరు, కంచీపురం, తిరువన్నమలై లలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.