Thursday, March 28, 2024

గద్వాలలో కఠినంగా లాక్ డౌన్.. బయటకు రాకుండా ఇళ్లకు తాళాలు..

- Advertisement -
- Advertisement -

 

గద్వాల్: జిల్లా కేంద్రంలో కోరోనా వైరస్(కోవిడ్-19)కేసులు పెరగడంతో లాక్ డౌన్ ఆంక్షలను అధికారులు మరింత కఠినతరం చస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. జిల్లాకు దగ్గరగా ఉన్న కర్నూల్ లో ఇటీవల కరోనాతో చనిపోయిన డాక్టర్ వద్ద గద్వాల వాసులు వైద్యం చేయించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రత్యేక అధికారులతో జిల్లాలో సూక్ష్మస్థాయి పరిశీలన చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎవరూ బయటకు రాకుండా అధికారులు ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 47 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 1,001 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 25మంది ప్రాణాలు కోల్పోయారు.

47 Corona Cases Registered in Gadwal District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News