Home అంతర్జాతీయ వార్తలు జపాన్‌లో తుఫాన్ బీభత్సానికి 48 మంది బలి

జపాన్‌లో తుఫాన్ బీభత్సానికి 48 మంది బలి

 Firestorm

 

గల్లంతైన వారి కోసం గాలింపు
సహాయ శిబిరాల్లో 30 వేల మంది బాధితులు

హొయసు (జపాన్) : జపాన్‌లో శనివారం హగి బిస్ తుఫాన్ బీభత్సానికి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గల్లంతు అయ్యారు. వందమంది గాయపడ్డారు. నదులు ఉప్పొంగి కొంచచరియలు, మటి పెళ్లలు విరిగిపడిన చోట రిస్కు బృందాలు సోమవారం ఆ మట్టి పెళ్లలను తొలగించడం ప్రారంభించాయి. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నాయి. దాదాపు 20కు మించి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. టోక్యోకు నైరుతి దిక్కులో కనగవ ప్రాంతంలో 48 గంటల పాటు ఏక ధాటిగా 100 సెంమీ వరకు కుంభవృష్టి కురిసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. నివాస ప్రాంతాలు, పొలాలు, రోడ్లు, సోమవారం వరకు వరద నీటి ముంపులోనే ఉన్నాయి.

తుపాన్ రక్షణ శిబిరాల్లో దాదా పు 30 వేల మంది తలదాచుకుంటున్నారు. వరద ప్రాంతాల్లోని బాదితులను రక్షిత ప్రాంతాలకు తరలించడానికి హెలికాఫ్టర్లుతోపాటు ఫైర్‌ఫైటర్స్ రంగం లోకి దిగారు. హొయసు నగరం అంతా బురద నీటితో నిండి ఉంది. యాపిల్ తోటలు ధ్వంసం అయ్యాయి. చికుమ నది గట్టుకు గండి పడి నగనో ప్రాంతం నీటి ముంపుతో బాగా దెబ్బతింది. మియాగి, ఫుకుషిమా ప్రాంతాలు కూడా వరదనీటి ముంపులో ఉన్నాయి. సోమవారం వరకు 35, 100 ఇళ్లకు ఇంకా విద్యుత్ సరఫరా లేదని, టోక్యో విద్యుత్ సంస్థ వెల్లడించింది. అయితే సోమవారానికి టోక్యోలో చాలా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడిందని, సాధారణ జనజీవనం సాగుతోందని ప్రభుత్వం వివరించింది.

48 killed in Japan Firestorm