Home తాజా వార్తలు ఎయిర్‌పోర్టులో రూ.48 లక్షల బంగారం పట్టివేత

ఎయిర్‌పోర్టులో రూ.48 లక్షల బంగారం పట్టివేత

Gold

శంషాబాద్: అక్రమంగా విదేశాల నుండి ముంబై మీదుగా హైదరాబాద్‌కు బంగారం తరలిస్తున్న ముగ్గురు ప్యాసింజర్లను  గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన కథనం ప్రకారం… నకిలీ ఆధార్ కార్డులతో ముగ్గురు ప్యాసింజర్లు ముంబై నుండి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమానం నెం.ఎ1 50లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వారి ఆధార్ కార్డులను తనిఖీ చేయగా అవి నకిలీవిగా గుర్తించారు.

దీంతో వారి లాగేజిని తనిఖీ చేయగా మూడు బాల్స్ నల్లని టేప్ చుట్టబడినట్లు తెలిపారు. వాటి మధ్యలో బంగారం పేస్టులు ఉన్నాయి. వీటి బరువు 1420గ్రాములు ఉంది. ఈ పేస్టును బిస్కేట్‌ల మాదిరిగా మార్చగా వాటి బరువు 1235గ్రాములుగా ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ బహిరంగా మార్కెట్‌లో రూ.48,49,062 ఉంటుందన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు.

48 lakhs Worth Gold Seized in Shamshabad Airport