Home జాతీయ వార్తలు మావోయిస్టుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

మావోయిస్టుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

Maoistsఛత్తీస్‌గఢ్ : కాంకేర్‌లో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ కు చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను తక్షణమే హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలకు మవోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కాంకేర్ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

4Jawans Shot Dead by Maoists in Chhattisgarh