Home వరంగల్ సామాజిక న్యాయం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

సామాజిక న్యాయం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

5 acres of land in Hyderabad for Mudiraj Building

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేధాశక్తి, విద్యావంతులు, ఎవరి మనస్సును నొప్పించని మనోన్నతమైన నాయకుడు మంచి మనుసున్న వ్యక్తి డాక్టర్ బండా ప్రకాశ్ అని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్వర్యంలో ఆదివారం విష్ణుప్రియ గార్డెన్స్‌లో ముదిరాజ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లబోయిన అశోక్ కుమార్ ఆధ్యర్యంలో నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ఆత్మీయ సన్మాణ సమావేశానికి ముఖ్య అతిధిగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి హాజరై మాట్లాడుతూ మంచి మనుసున్న వ్యక్తి, విద్యావంతుడు, ఎవరి మనస్సును నొప్పించని నాయకుడు డాక్టర్ బండా ప్రకాశ్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ అన్ని కులాల వారికి సమాన న్యాయాన్ని కల్పించడం జరుగుతుందని, సామాజిక న్యాయం కల్పించడం ఒక్క టిఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని, తెలంగాణ ఉధ్యమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. అదే విధంగా ఏ కులాన్ని కూడా చిన్నచూపు చూడకుండా అన్ని కులాలకు సంబంధించిన వారికి సమాన న్యాయ పరిపాలన అందించుటకై కెసిఆర్ పోరాటం చేస్తున్నారని ఇప్పుడు ముదిరాజ్ ముద్దుబిడ్డా తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన బండా ప్రకాశ్‌కు రాజ్యసభ సభ్యుడిగా నియమించడం చాలా సంతోషదాయకమన్నారు.

ముదిరాజ్ భవనానికి హైదరాబాద్‌లో 5 ఎకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్ల రూపాయలను ఏర్పాటు చేయడం  జరిగిందన్నారు. కుల వృత్తులను మెరుగుపర్చడం కోసం ప్రత్యేకంగా నిధులకు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతం నుంచి ఆర్థికంగా ఎదుగాలని చెరువులకు, కుంటలలో, రిజర్వాయర్లలో చేపపిల్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని, తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అందులో కూడ చేప పిల్లలను వేయడం జరుగుతుందని రిజర్వాయర్లు పూర్తయిన తర్వాత ముందుగా సంతోషించేది ముదిరాజ్ లేనని అన్నారు. అంతే కాకుండా ఆడపిల్లలు నిరాక్షరాస్యులుగా ఉండి నాణ్యమైన విద్యను అందించలేక పోతున్నామని వారి కోసం 119 నియోజకవర్గాలలో 119 బిసి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ కొరకై కృషి చేస్తున్నారని అనేక పథకాలు కళ్యాణలక్ష్మి, రైతుబందు పథకం, కేసిఆర్ కిట్టు, ప్రతి ఇంటికి మంచి నీరు ఇలా చాలా పథకాలను అమలు చేస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ముదిరాజులు రిజర్వేషన్లు పై బిసి డిలో ఉన్న రిజర్వేషన్ను బిసి ఎ లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ వినయ్ బాస్కర్ మాట్లాడుతూ విద్యా వంతుడు, మంచి మేధాశక్తి గల నాయకుడు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అని అన్నారు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఎంఎల్‌ఎ కొండ సురేఖ మాట్లాడుతూ బండ ప్రకాశ్‌తో చాల సంవత్సరాల నుంచి పరిచయం ఉందని, ఒకే పార్టీలో చాలా కాలం పనిచేశామని ఎప్పుడు కూడ కులం కోసం పరితపించేవాడని అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించి అత్తున్నత పదవిని ఇచ్చి గౌరవించడం చాలా సంతోషదాయకమన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నీను రాజ్యసభ సభ్యుడిని అవుతానని నీను ఎప్పుడు ఊహించలేదన్నారు. అనుకోకుండా నాకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటానన్నారు.

నాకు వచ్చిన రాజ్యసభ పదవి నా ఒక్కడిది కాదని నా ముదిరాజ్ ముద్దు బిడ్డల కృషి వల్ల నాకు ఈ పదవి వచ్చిందని, ముదిరాజ్ కుల బాంధవులకు నీను ఎప్పుడు రుణ పడి ఉంటానని, ముదిరాజ్‌లకై ప్రత్యేకంగా కమిటీ హల్స్‌ను కట్టించడం జరిగిందని కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 120కి పైవ భవనాలను నిర్మాణం చేశామన్నారు. అంతేకాకుండా రాజకీయ ఎదుగుదలకై ముదిరాజ్ నాయకులు కృషి చేయాలని, ప్రతి ఒక్కరు కులం కోసం ఉధ్యమించాలన్నారు. కేసిఆర్ కూడ ముదిరాజ్ వారికి ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని పెద్దపెద్ద రిజర్వాయర్‌న్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం డిప్యూటి సీఎం, ఎంఎల్‌ఎలు, ఉమ్మడి వరంగల్ ముదిరాజ్ సంఘం నాయకులు ఘజమాలతో బండా ప్రకాశ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బోరిక సదానందం, జగన్‌మోహన్, సాంబయ్య, రాజారపు ప్రతాప్, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నాయకులు ఇండ్ల నాగేశ్వర్, పులి రజీనికాంత్, కార్పొరేటర్ బయ్యా స్వామి,  సారంగపాణిలతో పాటు వివిధ జిల్లా అధ్యక్షులు, ముదిరాజ్ నాయకులు కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.