Saturday, April 20, 2024

వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్
తుపాకులు, జంతు చర్మాలు స్వాధీనం
పక్కా సమాచారంతో పట్టుకున్న అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః వన్య ప్రాణులను వేటాడేందుకు వెళ్లిన ఐదుగురు వేటగాళ్ల ముఠాను నిజామాబాద్ వర్ని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈక్రమంలో నిందితులు లుక్మాన్ అఫెండి, ఇమ్రాన్ అఫెండి, ఎండి షారుఖ్ ఖాన్, షేక్ రాజ్ అహ్మద్, ఎండి జమీలుద్దీన్‌ల నుంచి రెండు నాటు తుపాకులు, అడవి జంతువు చర్మాలు కారు. ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వర్ని అటవీ ప్రాంతంలో తుపాకులతో హల్‌చల్ చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పాటు అటవీ ప్రాంతానికి సమీపంలోని ముఠాలోకి కీలక సభ్యుడు అఫెండి రైస్‌మిల్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్ ఖాన్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. నిందితులు జకోరా గ్రామంలో లైసెన్స్‌తుపాకులతో అడవి జంతువులను వేటాడుతూ నిందితులు హల్‌చల్‌చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా ఫారెస్ట్ ఆఫీస్‌లో వేటగాళ్లు దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు సమాచారం అందుకుని ఫారెస్ట్ ఆఫీసుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారని అధికారులు వివరించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు ఓ ముఠా సంచరిస్తోందన్న పక్కా సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున అటవీ శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రైస్ మిల్లుపై దాడులు నిర్వహించి వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ముఠాలోని లుక్మాన్ అఫెండి అనే వ్యక్తి అధికారులను అడ్డగించడంతో పాటు దాడికి యత్నించినట్లు అధికారులు వివరిస్తున్నారు.

కాగా రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టిన అధికారులు బ్లాక్ నేపెడ్ హరే, దాని చర్మం, టెలిస్కోప్, సైలెన్సర్లు, సెర్చ్ లైట్లు, బైనాక్యులర్లు, కత్తులు, టార్చ్ లైట్లతో పాటు రెండు రైఫిల్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ముఠాలోని ప్రధాన నిందితుని వివరాలు సేకరించి నగరంలోని గుడిమల్కాపూర్ మెహదీపట్నం వద్ద ఉన్న లుక్మాన్ అఫెండి ఇంటిపై దాడి చేసి ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసిన డీప్ ఫ్రీజ్‌లో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు లుక్మాన్ అఫెండి తదితరుల నుంచి చేసుకున్న వాటిని పరీక్షల నిమిత్తం సిసిఎంబికి తరలించారు. ఇదిలావుండగా వన్యప్రాణాల వేటలో పట్టుబడిన నిందితులను వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ఫారెస్ట్ నిబంధనల ఉల్లంఘనల చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు లక్మాన్ అఫెండి తరచూ వేటలకు వెళుతున్నట్లు విచారణలో తేలింది. అతనితో పాటు హైదరాబాద్‌లోని తన స్నేహితులను వేటకు తీసుకెళ్లడం పరిపాటిగా మారిందని, ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఈ ముఠా వేటకు వెళ్లిందని, అయితే అతని ప్రయత్నాలు ఫలించలేక పోవడంతో వేటను శనివారం నాటికి వాయిదా వేసుకున్నాడు. అఫెండి తన ముఠీ సభ్యులతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం అతను తన సహచరులతో కలిసి అటవీ ప్రాంతాల దగ్గర వేటాడేందుకు వెళ్ళాడు.

దీంతో పక్కా సమాచారం అందుకున్న పిసిసిఎఫ్ విజిలెన్స్, పోలీసు శాఖ, డిఎఫ్‌ఓ నేతృత్వంలోని విజిలెన్స్ బృందాలు శనివారం రాత్రికి జాకోరాకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు, పై వేటగాళ్ళను నిజామాబాద్ డివిజన్‌లోని వర్ణి అటవీ శ్రేణికి చెందిన జాకోర వద్ద ఉన్న అఫెండి బిన్నీ రైస్ మిల్లుపై దాడులు చేసి అరెస్ట్ చేశారు. నిందితులపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 25000 జరిమానా పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 18004255364 ద్వారా అటవీ శాఖకు చేరవేయాలని అధికారులు కోరారు.

5 arrested for poaching by forest officials in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News