Home తాజా వార్తలు వరంగల్ బావిలో మరో 5 మృతదేహాలు

వరంగల్ బావిలో మరో 5 మృతదేహాలు

Dead Bodies

 

గొర్రెకుంటలో మరో 5 మృతదేహాలు వెలికితీత
మృతులంతా త్రిపుర, బీహార్‌కు చెందిన వలస కూలీలే
సామూహిక మరణాలపై వీడని మిస్టరీ
హత్యలా..సామూహిక ఆత్మహత్యలా?
10ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

మన తెలంగాణ/వరంగల్ క్రైం: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో జరిగిన సామూహిక మరణాల ఉదంతం మిస్టరీగా మారింది. గొర్రెకుంట గోనె సంచుల గోదాంలో నివాసం ఉంటున్న తొమ్మిది మంది వలస కూలీలు మృతిచెందారు.

గురువారం బావిలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం మరో ఐదు మృతదేహాలను బావి నుం చి వెలికితీశారు. ఈసంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, రాష్ట్ర మంత్రులతో పాటు సిపి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వరంగల్ ఎంజిఎం మార్చురీకి తరలించారు. గురువారం లభ్యమైన మృత దేహాల్లో త్రిపురకు చెందిన కుటుంబ యజమాని మసూద్ (55) ఆయన భార్య నిష(48), కూతురు బూస్రుఖాతర్(22) బూస్రుఖాతర్ కొడుకు(3) ఉన్నాయి.శుక్రవా రం ఉదయం అదే బావిలో ముందుగా మసూద్ కొడుకు షాబాద్ అలం(21), సోయెబ్ అలం(18), షకీల్ (30)ల మృతదేహాలు వెలికి తీశారు. దీంతో పోలీసులు ఫైరింజన్ సహాయంతో బావిలోని నీటిని ఇంజన్ ద్వారా తోడారు. బావి అడుగు భాగంలో ఉన్న బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాములు మృతదేహాలు కూడా వెలికితీశారు.

మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు లభ్యం కావడంతో సామూహిక మరణాల సంఘటన పెనుసంచలనంగా మారింది. వెంటనే సిపి రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజి ఎం మార్చురికి తరలించారు. గురువారం వరకు నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందితే, వారు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. మసూద్ కుటుంబానికి చెందిన వారు ఆరుగురు, అయి తే మరో ముగ్గురు ఇతర రాష్ట్రానికి చెందిన వారు. కుటుంబానికి సంబంధం లేని వారు కూడా మృతిచెందడం మిస్టరీగా మారింది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యా ప్తు చేపట్టారు. అయితే మసూద్ కుటుంబం 20 సంవత్సరాల క్రితమే వరంగల్‌కు వచ్చి కరీమాబాద్‌లో స్థిరపడింది.

ఇటీవల లాక్‌డౌన్ నేపథ్యంలో పనిచేస్తున్న పరిశ్రమకు కరీమాబాద్ నుంచి రావడానికి ఇబ్బందులు ఎదురుకావడంతో పరిశ్రమ వద్దనే రెండు నెలలుగా కుటుంబసభ్యులతోపాటు బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఉంటున్నారు. ఇదిలా ఉంటే మసూద్ కూతూరు బుస్రుఖాతర్‌కు భర్త నుంచి విడాకులు పొంది తల్లితండ్రుల వద్దనే ఉంటుంది. స్థానికంగా ఉన్న వ్యక్తితో బూస్రుఖాతర్‌కు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు స్థానికులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బుస్రూఖాతర్ కొడుకు జన్మదినం సందర్భంగా బర్త్‌డే వేడుకలను గొర్రెకుంటలో చేసుకున్నారు. ఈ వేడుకలకు మసూద్ కుటుంబంతో పాటు షకీల్, బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాములు కూడా హాజరయ్యారు. వారితో పాటు స్థానిక యువకులు హాజరై రెండు వర్గాలకు ఘర్షణ జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో సామూహిక ఆత్మహత్యలా… లేక హత్యలా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీమాబాద్‌కు చెందిన యాకూబ్ పాషాతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బుస్రుఖాతర్ భర్త ఢిల్లీ నుంచి వరంగల్‌కు వచ్చి సంఘటనకు ముందు ఈ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ మరణాలకు అతను వైపు నుంచి పక్కా ప్లాన్ జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ద ర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఒంటిపై ఎలాంటి గాయా లు లేనందున, బర్త్‌డే పార్టీలో తీసుకున్న తీపి పదార్థాల్లో విషం పెట్టి హత్య చేసిన అనంతరం శవాలను బావిలో పడవేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన కేసును త్వరలో చేధిస్తామని సిపి రవీందర్ విలేకరులకు చెప్పారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ

మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల సరిహద్దులోని గొర్రెకుంటలో 9 మంది సామూహిక మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ ఎంజిఎం మార్చురీలో మృతదేహాలను సం దర్శించిన అనంతరం వారి కుటుంబసభ్యులను మం త్రులు ఓదార్చారు. జరిగిన సంఘటనపై నిజనిజాలు వెలికితీసేందుకు పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ చేయ డం జరిగిందని వారు పేర్కొన్నారు. మృతులకు అం త్యక్రియలు వరంగల్‌లో చేసినా వారిస్వస్థలమైన త్రిపుర, బీహార్‌లలో చేసినా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని వారు చెప్పారు. మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు.

5 Dead bodies identified in Well at Gorrekunta