Saturday, September 30, 2023

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఐదుగురు దుర్మ‌ర‌ణం

- Advertisement -
- Advertisement -

5 died in Road Accident in Sangareddy

సంగారెడ్డి: జిల్లాలోని చౌట‌కూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు వ్య‌క్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

5 died in Road Accident in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News