Home తాజా వార్తలు 5కెజిల గర్భసంచి కణతి తొలగింపు…

5కెజిల గర్భసంచి కణతి తొలగింపు…

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ టౌన్: ఆదివారం రాత్రి నాగర్‌కర్నూల్ పట్టణంలోని అనితకేర్ ఆసుపత్రిలో   ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామం చెందిన  ముత్యాలమ్మ(40)అనే మహిళలకు దాదాపు 7 నెలల గర్భవతి సైజ్‌లో ఉన్న కణతిని ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది. ఇంత సైజులో కణతి పెరగడం అరుదుగా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో, కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. ఆసుపత్రిలో స్కాన్ చేయించి గర్భసంచి కణతిగా గుర్తించి 5బాటిళ్ళ రక్తం ఎక్కించిన తర్వాత ఈ మేజర్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ మానిక్యాల చెన్నయ్య నిర్వహించారు. ఆనస్తేసియా డాక్టర్ ప్రభు, రామకృష్ణారెడ్డి, రామ్‌లు, అసిస్టెంట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ముత్యాలమ్మ క్షేమంగా ఉన్నదని తెలియజేశారు.