Home జాతీయ వార్తలు కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనం

కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనం

5 killed in accident as car catches fire

రామ్‌ఘర్ (ఝార్ఖండ్): ఝార్ఖండ్ లోని రామ్‌ఘర్ జిల్లా ముర్బంద గ్రామం వద్ద బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్సును ఢీకొన్న కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. వీరంతా పాట్నాకు చెందిన వారు. మృతుల్లోని పెద్దల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా, మరొకరు కుర్రాడు. రాజ్రప్ప పోలీస్ స్టేషన్ పరిధి లోని రామ్‌ఘర్‌గోలా మెయిన్ రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగిందని ఎస్‌పి ప్రభాత్ కుమార్ చెప్పారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చేర్చారు. మృతుల చిరునామా వివరాలు సేకరిస్తున్నారు.