Thursday, April 25, 2024

5లక్షల మందికి కొత్తగా రైతుబంధు

- Advertisement -
- Advertisement -

5 lakh new farmers get Rythu Bandhu

నేటి నుంచి నిధుల పంపిణీ ప్రారంభం
68.10 లక్షల మందికి రూ.7,521
కోట్లు కొత్తవారి చేరికతో
రూ.110కోట్ల అదనపు భారం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు తొమ్మిదవ విడత నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ పథకం కిం ద ఈ వానాకాలం పంటల సా గుకు సబంధించి 68.10లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రూ.7521.80కోట్లు సిద్దం చేసివుంచింది. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుబంధు నిధులు పంపిణీ కా ర్యక్రమాన్ని లాంఛనంగా ప్రా రంభించనున్నారు. ఎకరం, ఆలోపు విస్తీర్ణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలకు నేరు గా నిధులు జమ చేయనున్నా రు. ఆ తర్వాత రోజు నుంచి రో జుకు ఎకరం విస్తీర్ణం చొప్పున పెంచుకుంటూ రైతుబంధు ని ధులు జమ చేయనున్నారు. ఈ వానాకాలంలో 1,50,43,606ఎకరాలకు పెట్టుబడి సాయం అందించనున్నారు. ఒక్కో ఎకరానికి రూ.5000 చొప్పున ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా సం బంధిత రైతుల ఖాతాకు జమ చేయనుంది.

యాసంగితో పోలిస్తే ఈ సారి వానాకాలంలో 5.10లక్షల మంది కొత్త రైతులకు రైతుబంధు నిధులు అందజేయనున్నారు. ప్రభుత్వ ఖజానాపైన రూ. 110.28 కోట్లు అదనపు భారం పడనుంది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు అర్హతగల రైతులందరికీ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్దం చేసివుంచింది. గత వానాకాలం(202122) పంటల సాగుకు రైతుబంధు పథకం ద్వారా 60.84లక్షల మందిరైతులకు రూ.7360.41కోట్లు అందజేయగా , గత యాసంగిలో 63లక్షల మంది రైతులకు రూ.7411.52కోట్లు పంపిణీ చేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా కేసిఆర్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. సాగుఖర్చులు పెరిగిపోయి ,బ్యాంకుల్లోనే కాకుండా , ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద రుణాలభారం భరించలేక పొతున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొద్దిపాటి ఉపశమనమైనా కల్పించాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కేసిఆర్ మేథోమధనం నుంచి పుట్టుకొచ్చిన రైతుబంధు పథకం ఇప్పడు సన్న, చిన్నకారు బడుగు బలహీన వర్గాల రైతులకు వరంలా మారటమే కాకుండా పెద్దరైతులకు కూడా సాయం అందిస్తోంది. 201819ఆర్ధిక సంవత్సరం వానాకాలం సీజన్‌లో తొలిసారి రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News