Tuesday, March 19, 2024

గీత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

Srinivas Goud

 

రంగారెడ్డి : గత ప్రభుత్వాలు కల్లుగీతా కార్మికులకు లైసెన్స్‌లు ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాడ్గులలో కల్లుగీత కార్మికులకు టిఎఫ్ టి లైసెన్స్ లు మంజూరు చేశారన్నారు.  తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు లైసెన్స్‌లు మంజూరు చేసిందని, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గీత కార్మికుడు చనిపోతే ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నామని, అన్ని కుల వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటోందని, కెఎల్‌ఐ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. మాడ్గులలలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన సూచించారు.

 

5 Lakhs give Accidental death of Geetha Karmikudu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News