Saturday, April 1, 2023

ట్రాక్టర్ బోల్తా: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: చేపల చెరువలో ట్రాక్టర్ బోల్తాపడడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సజ్జాపురంలో జరిగింది. ట్రాక్టర్‌లో కూలీలు పనులకు వెళ్తుండగా అదుపుతప్పి చేపల చెరువులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలో మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హరిబాబు(43), వెంకటతారమణేమ్మ(19), కోటి పెంచాలయ్య(60), లక్ష్మికాంతమ్మ(45)గా గుర్తించారు.  కూలీలు పుచ్చకాయలు కోసేటందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News