Home జాతీయ వార్తలు 50 కిలోల బంగారు దుర్గమ్మ

50 కిలోల బంగారు దుర్గమ్మ

 

కోల్‌కతా:  పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 50 కిలోల బంగారాపు దుర్గమాత విగ్రహాన్ని తయారుచేశారు. నవరాత్రులు సందర్భంగా దుర్గామాతను 250 మంది కూలీలు మూడు నెలలు కష్టపడి తయారుచేశారు. తయారు చేయటానికి రూ. 30 నుంచి 50 లక్షల ఖర్చు అయిందని దుర్గోత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ ఘోష్ తెలిపారు. సంతోష్ మిత్రా స్కోయర్ సరబోజోనిన్ దుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు గత 84 సంవత్సరాల నుంచి దుర్గమాతలను ప్రతిష్ట చేస్తున్నామన్నారు. ఇది తొలిసారి చేయలేదని 2017లో అభరణాలు, బంగారపు చీరతో అద్భుతంగా దుర్గమాతా విగ్రహానికి అలంకరణ చేశామని వెల్లడించారు. ఈ దుర్గమాతను చూడటానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దుర్గమ్మకు పోలీసులు పెద్ద సంఖ్యలో భద్రతా కల్పిస్తున్నారు. దుర్గమాతా పందిరిని 10 వేల గ్లాసులతో డెకరేషన్ చేశామన్నారు. డెకరేషన్ అద్భుతంగా ఉందని భక్తులు కొనియాడుతున్నారని నిర్వహకులు తెలిపారు.

Durgamma Idol Made with 50 KG Gold in West Bengal

 

Durgamma Idol Made with 50 KG Gold in West Bengal