Friday, April 19, 2024

త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ

- Advertisement -
- Advertisement -

ఉద్యోగుల వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
మాజీ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల కనీస పెన్షన్ రూ.30వేల-50వేలకు పెంపు
గరిష్టంగా రూ.70వేలు, వైద్య బిల్లుల పరిమితి రూ.10లక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న నిరుద్యో గులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త తెలి పారు. త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయా న్ని అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అసెం బ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా ప్రభు త్వ ఉద్యోగుల విరమణ వయోపరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంపు బిల్లుపై ఆయన మాట్లాడుతూ, మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా వయో పరిమితినిప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. వయసు పెంపుతో ఉద్యోగ ఖాళీల కు ఇబ్బంది లేదన్న ఆయన, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ వెంటవెంటనే ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల విరమణ వయస్సు 58 ఏళ్లుగా ఉందన్నారు. నాలుగో తరగతికి ఉద్యోగులకు 60ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది వయస్సు 65 ఏళ్లు, న్యాయ సిబ్బందికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉందన్నారు. దేశంలోని కొన్ని రా ష్ట్రాల్లో 6062 సంవత్సరాల వరకు పదవీవిరమణ వ యస్సు అమలులో ఉందన్నారు. గత ఎన్నికల సమయం లో టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మే రకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు బిల్లును సభ ముందుకు తేవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని వేతన సవరణ కమిషన్ ముందు ఉంచడం జరిగిందన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ నిర్ణ యం తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో బిల్లుకు అం దరూ ఏకగ్రీవంగా మద్ధతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని ఎవరూ వ్యతిరేకంచకపోవడంతో ఏకగ్రీ వంగా సభ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు అయిందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
వైద్య బిల్లులు రూ. 10 లక్షలకు పెంపు
శాసనసభ్యులు, మాజీ శాసన సభ్యులు అత్యసరంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో అనేక ఇబ్బందులు పడుతు న్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇటీవల మాజీ శాసనసభ్యుడు బాగన్న నిమ్స్ ఆసుపత్రిలో మరణించార న్నారు. అయితే ఆసుపత్రి బిల్లును పూర్తి స్థాయిలో చెల్లిం చలేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. ఈ విషయం సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకవెళ్లడంతో సమ స్య వెనువెంటనే పరిష్కారమైందన్నారు. ఈ నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు కూడా కొందరు సిఎంను కలిసి వైద్య బిల్లుల మొత్తాన్నిపెంచాలని కోరారని మంత్రి హరీ శ్‌రావు గుర్తు చేశారు.
వారు చేసిన విజ్ఞప్తి మేరకు సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల (సతీమణి లేదా భర్త)కు అవసరమైన వైద్య చికిత్సల కోసం పది లక్షలు ఖర్చు చేసేలా బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింద న్నారు. అలాగే మాజీ శాసన సభ్యులకు సంబంధించిన కనీస పెన్షన్ 30 వేల నుంచి 50 వేల వరకు గరిష్ఠంగా 75 వేల వరకు ఈ బిల్లులో పెట్టడం జరిగిందన్నారు. దీనికి సభ్యులంతా మద్దతు తెలపడంతో ఈ బిల్లు ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపినట్లు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News