Tuesday, April 23, 2024

కరోనా మృదంగం

- Advertisement -
- Advertisement -

corona

 

ఇంగ్లాండ్‌లో ఒకే రోజు 500మంది మృతి

రానున్న 15 రోజుల్లో అమెరికాలో మరణపుటంచుల్లో 2లక్షల మంది?
శ్వేతసౌధం బృందం విశ్లేషణ
ఈ రెండు వారాలు మనకు గడ్డుకాలమే
కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నాం
అమెరికన్లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా 43వేలు దాటిన మరణాలు

పారిస్/లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి 8,65, 970కు దాటిపోగా, మరణాల సంఖ్య 43,082కు చేరుకున్నట్లు వివిధ దేశాల అధికారిక సమాచారం ఆధారంగా ఎఎఫ్‌పి వార్తాసంస్థ రూపొందించిన వివరాలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటివరకు 1.72,500 మంది కరోనానుంచి కోలుకున్నట్లు ఆ వివరాలు వెల్లడించాయి. గత ఫిబ్రవరి
చివర్లో తొలి కరోనా మరణం నమోదైన ఇటలీలో ఇప్పటివరకు 12,428 మంది చనిపోగా, 1,05,792 కరోనా పాజిటివ్ కేసు లు నమోదైనాయి.

కాగా ఇప్పటివరకు 15,729 మంది బాధితు లు కోలుకున్నారు. కాగా ఇటలీ తర్వాత రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 9,053 మరణాలు సంభవించగా, 1,02, 36 కేసు లు నమోదైనాయి. హాంకాంగ్, మకావు మినహా చైనాలో బుధవారంవరకు 3,312మరణాలు సంభవించగా,81,554 కరోనా కేసులు నమోదూనాయి. కాగా వీరిలో 76,238 మంది కోలుకున్నారు. బుధవారం కొత్తగా 36 కేసులు నమోదు కాగా, ఏడు మరణాలు సంభవించాయి. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 1,89,633 కేసులు నమోదు కాగా, 4,081 మరణాలు సంభవించాయి. కాగా 7,138 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

బ్రిటన్‌లో ఒక్క రోజే 500 మరణాలు
కాగా బ్రిటన్‌లో మొట్టమొదటి సారిగా ఒక్క రోజులోనే 500 కరోనా మరణాలు సంభవించాయి. అలాగే 4,324 కొత్త కేసు లు నమోదైనాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29,474కు చేరుకుంది.31వ తేదీ సాయం త్రం 5 గంటల సమయానికి కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2,352 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ అధికార ట్విట్టర్ పేజీలో తెలిపిం ది. అలాగే 29,474 పాజిటివ్ కేసులు నమోదైనాయని, నిన్నటితో పోలిస్తే 4,324 కేసులు పెరిగాయని ఆ ప్రకటన తెలిపింది. కాగా మంగళవారం బోట్సానా, స్లోవేకియా, కాంగోబ్రాజివిల్లే, ఎల్‌సాల్వడార్‌లలో తొలి కరోనా మరణాలు సంభవించాయి.

రెండు వారాల గడ్డు స్థితి : ట్రంప్
అమెరికా రెండు వారాల పాటు కఠిన, బాధాకర పరిస్థితిని భరించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పష్టం చేశారు. కరోనా వైరస్ దేశంలో అదుపులేకుం డా విజృంభిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు వెలువడ్డా యి. వచ్చే పది పదిహేను రోజులతో కరోనాతో లక్ష నుంచి రెండు లక్షల మంది వరకూ చనిపొయ్యే అవకాశం ఉందని వైట్‌హౌజ్ వర్గాలు అంచనావేశాయి. ఈ తరుణంలోనే ట్రంప్ మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ ఆటకట్టుకు పలు కటుతర చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. వచ్చే రెండు వారాలు ప్రజలకు బాధాకరంగానే ఉంటాయి. అయితే వీటిని అనివార్యంగా అనుభవించాల్సి ఉంటుందని ట్రంప్ తెలిపారు.

ఎప్రిల్ 30వ తేదీ వరకూ ప్రజల మధ్య భౌతిక దూరం నిబంధనలను విస్తృతస్థాయిలో అమలుచేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు దేశం అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొంటోందని ట్రంప్ తెలిపారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పరిస్థితి దారుణంగా మారిందన్నారు. అంతర్యుద్ధాన్ని అనుభవించామని, అప్పట్లో 6 లక్షల మందిని పోగొట్టుకోవల్సి వచ్చిందని, ఇప్పుడు ఈ పెను సవాలు వచ్చిపడిందని, అయితే మనం ఏమీ చేయలేమని అనుకోవద్దని, పలుసార్లు ఎన్నో దెబ్బలు తిన్నామని, ఇప్పుడు ఓ సంక్షోభం ఎదురవుతోందని, అయితే ప్రజలు ఆత్మ విశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

500 people killed in England in one day
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News