Home తాజా వార్తలు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా.. నలుగురు అరెస్ట్

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా.. నలుగురు అరెస్ట్

Rice-Seizedపెద్దపల్లి: రామగుండం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండటాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఈ బియ్యం ధర సుమారు రూ. 11 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతేకాకుండా రేషన్‌ బియ్యం తరలిస్తున్న రెండు లారీలు, రెండు మినీవ్యాన్‌లను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

500 Quintals Ration Rice Seized in Peddapalli