*నిత్య జనగణమనతో జమ్మికుంటకు గొప్పపేరు
*హుజురాబాద్ డివిజన్‌లో డ్రోన్ కెమెరా ఏర్పాటు
*కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి
మనతెలంగాణ/జమ్మికుంట: సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వచ్చాయని ఇప్పటి వరకు జిల్లావ్యాప్తం గా 2వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని జిల్లా వ్యాప్తం గా 50వేల కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సి ద్ధం చేసుకున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సిపి అకస్మిక తనిఖీ చేశారు.స్టేషన్ పరిసరాలు,పోలీస్‌సిబ్బంది పనితీరు కేసు వివరాలు రికార్డులను పరిశీలించారు.పోలీస్ స్టేష న్ వచ్చె బాధితులపట్ల పోలీసులు ఏలా ప్రవర్తిస్తున్నారని పలువురిని సిపి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి పి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసుల ప్రవర్తనలో మా ర్పు రావాలనే సంకల్పంతో ప్రతి పోలీస్‌స్టేషన్ సిబ్బందికి శి క్షణ ఇస్తున్నామని తెలిపారు.మొబైల్ ఆప్ ద్వారా ప్రతి కేసు ఆన్‌లైన్‌లో చేసేలా బ్లూకోట్ సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వ డం జరుగుతుందని సిపి స్పష్టం చేశారు.బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వస్తే ఏలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య తీరు ను బట్టి వెంటనే పరిష్కారం అయ్యేలా 2018లో ఆధునిక టెక్నాలాజీతో ముందుకుపోతామని తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జనవరి1 నుంచి పోలీస్ గ్రామ సందర్శన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నా రు.గ్రా మ సందర్శన చేసినప్పుడు అ గ్రామంలో పోలీస్ సమస్యలు ఏమి ఉన్నాయి, పాత నేరస్థుల స్థితిగతులపై ఇం కా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది పూర్తి నివేదిక తీసుకుని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు.ప్రతి డివిజన్ కేంద్రంలో డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామని అం దులో భాగంగా హుజురాబాద్‌కు ఒక డ్రోన్ కెమెరా ఇచ్చామని అన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రతి మండలం గ్రామ ంలో జరిగే అసాంఘిక కార్యకాలాపాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.డ్రోన్ కెమెరా ద్వారా కరీంనగర్ జి ల్లా కేంద్రంలో పేకాట బహిరంగ మద్యం మహిళలపై వే ధింపులు తదితర నేరాలు అధుపులోకి వచ్చాయని సిపి పే ర్కొన్నారు.జమ్మికుంట పట్టణ పోలీస్‌స్ఠేషన్‌లో ప్రారంభమైన నిత్యజనగణమన దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులకు పునాది అయిన సిఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డిని సిపి అభినందించారు. అదే స్పూర్తితో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిత్యజనగణ మన కార్యక్రమం సిరిసిల్ల,జగిత్యాల జిల్లాలో నిత్యజనగనమన కార్యక్రమం ప్రారంభమైయిందని సిపి తెలిపారు.
ప్రతి స్టేషన్‌లో కూడా నిత్య జనగణమన జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర పోలీస్ సర్వే పూర్తి చేయ్యడంలో హైదరాబాద్ మొదటిది కాగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రెండవది అవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎసిపి కృపాకర్ పట్టణ సిఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి జమ్మికుంట రూరల్ సిఐ నారాయణ ఎస్‌ఐలు శ్రీనివాస్ నరేష్ తదితరులు ఉన్నారు.