Home అంతర్జాతీయ వార్తలు పాక్ జైళ్లలో 518 మంది భారతీయులు

పాక్ జైళ్లలో 518 మంది భారతీయులు

JAILఇస్లామాబాద్ : పాకిస్థాన్ జైళ్లలో 518 మంది భారతీయులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాక్ ప్రభుత్వం అక్కడి భారత హైకమిషనరేట్‌కు జైళ్లలో మగ్గిపోతున్న భారతీయ ఖైదీల వివరాలను అందజేసింది. పాక్ లోని వివిధ జైళ్లలో ఉన్న భారతీయుల్లో 463 మంది మత్స్యకారులు కాగా 55 మంది ఇతరులున్నట్టు నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం జనవరి 1న, జులై 1న (రెండుసార్లు) తమ తమ జైళ్లలో ఉన్న ఖైదీల వివరాలను ఎక్చేంజ్ చేసుకోవడం 2008 మే 21 నుంచి కొనసాగుతోంది.