Home జాతీయ వార్తలు దేశంలో ఒకేరోజు 27,114 పాజిటివ్ కేసులు

దేశంలో ఒకేరోజు 27,114 పాజిటివ్ కేసులు

519 Deaths and 27 114 New Covid 19 cases in India

న్యూఢిల్లీ: భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 27,114 కొత్త కోవిడ్-19 కేసులు, 519 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8లక్షలు దాటింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కోవిడ్ కేసులు 8,20,916కి పెరిగాయి. వీటిలో 2,83,407మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,15,386 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ తో 22,123 మంది ప్రాణాలు విడిచారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ పేర్కొంది.

అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచంలో కోటి 26లక్షల 25వేల మందికి పైగా కరోనా బారినపడగా… 5,62,820 మందిని కరోనా కబలించింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. యుఎస్ లో కొత్తగా 60వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా కేసులు 32,82 లక్షలు దాటాయి. మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2,38,461 మందికి కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 9,893 మంది కరోనాతో మృతి చెందారు. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది.

519 Deaths and 27 114 New Covid 19 cases in India